Vizag News:విశాఖపట్నంలో ఈనెల 14-15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. దీనిక ఒక రోజ ముందే ఏంటే ఇవాళ(గురువారం) అక్కడ పలు ఐటి కంపెనీలకు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేస్తారు. భాగస్వామ్య సదస్సులో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు రానుండగా, 13వ తేదీన నాలుగు ఐటి కంపెనీలతో పాటు రహేజా ఐటి స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్టు, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.

ఇప్పటికే టిసిఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో తమ డెవలప్‌మెంట్ సెంటర్లను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. టిసిఎస్ ద్వారా 12వేల ఉద్యోగాలు, కాగ్నిజెంట్ ద్వారా 8వేల ఉద్యోగాలు లభిస్తాయి. మంత్రి లోకేష్ చొరవతో గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద ఎఐ హబ్‌ను రూ.1.35లక్షల కోట్లతో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో విశాఖపట్నంపై జాతీయ, అంతర్జాతీయ ఐటి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

1. సెయిల్స్ సాఫ్ట్ వేర్ (SAILS SOFTWARE INC)

విశాఖపట్నం ఐటి హిల్ నెం.3లో సెయిల్స్ సాఫ్ట్ వేర్ సంస్థ ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ సాఫ్ట్ వేర్ ఇన్నొవేషన్ అండ్ ఎఐ ఎక్సలెన్స్ సెంటర్‌కు మంత్రి లోకేష్ భూమి పూజ చేస్తారు. దీనిద్వారా 300కుపైగా ఐటి నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. డిజిటల్ ఆంధ్రప్రదేశ్, ఇండియా ఎఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఎఐ, క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగించి అత్యాధునిక ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ పై సెయిల్స్ సాఫ్ట్ వేర్ దృష్టి సారిస్తుంది. భారత్ తోపాటు యుఎస్, యుకెలలో క్లయింట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ భారత్ లో క్లౌడ్ డెలివరీ కేంద్రాలు, ఆర్ అండ్ డి హబ్ లను నిర్వహిస్తోంది.

2. ఐ స్పేస్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ (ISPACE SOFTWARE SOLUTIONS)

విశాఖ ఐటి హిల్ నెం.2లో ఐ స్పేస్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ యూనిట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ప్రొడక్ట్ డెవలప్ మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటి సొల్యూషన్స్, ఐటిఓ సేవల డెలివరీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఎఐ, ఆటోమేషన్-ఎనేబుల్డ్ BPO/KPO సామర్థ్యాలతో హెల్త్‌కేర్ ITES సేవల డెలివరీ, ఏజెంట్ AI, జనరేటివ్ AI సొల్యూషన్స్‌పై దృష్టి సారించి, విశాఖలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. $60 మిలియన్ డాలర్ల వార్షికాదాయం కలిగిన ఐ స్పేస్ సంస్థ... ప్రస్తుతం భారత్ లో 1200మంది, యుఎస్ లో 300 మంది సిబ్బందిని కలిగి ఉంది.

3. టెక్ తమ్మిన సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ (TECH TAMMINA SOFTWARE SOLUTIONS)

విశాఖ ఐటి హిల్ నెం.2లో టెక్ తమ్మిన సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థకు మంత్రి లోకేష్ భూమిపూజ చేస్తారు. విశాఖ యూనిట్ ద్వారా లో-కోడ్, ఎఐ టెక్నాలజీలపై దృష్టిసారించడం ద్వారా తమ పోర్ట్ ఫోలియోను బలోపేతం చేయాలని భావిస్తోంది. రాబోయే ఐదేళ్లలో 2వేలమంది వరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. భారత్, యుఎస్ఎ, యుకె, యుఎఇలలో టెక్ తమ్మిన తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

4. ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (PHENOM PEOPLE PRIVATE LIMITED)

విశాఖ ఐటి హిల్ నెం.2లో ఫినోమ్ (phenom) గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేస్తారు. దీనిద్వారా ఎఐ, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, ఇన్నొవేషన్ కార్యకలాపాలను ఫినోమ్ సంస్థ నిర్వహిస్తుంది. తొలివిడతలో రూ.20కోట్ల పెట్టుబడితో యూనిట్‌ను నెలకొల్పి 400మందికి ఉపాధి కల్పిస్తారు. రెండోవిడతలో రూ.185 కోట్ల పెట్టుబడితో 2,100మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. అడ్వాన్స్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఎఐ రీసెర్చి, కస్టమర్ డెలివరీ ఎక్సలెన్స్‌పై ఫినోమ్ దృష్టి సారిస్తుంది.

5).రహేజా ఐటి స్పేస్ & రెసిడెన్షియల్ ప్రాజెక్టు (K.RAHEJA CORP.)

విశాఖపట్నం మధురవాడ ఐటి హిల్ నెం.3లో రహేజా ఐటి స్పేస్ & లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ భూమిపూజ చేస్తారు. విశాఖనగరానికి పెద్దఎత్తున ఐటి, కంపెనీలు, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు వస్తున్న వేళ ఆయా కంపెనీలకు అవసరమైన ఐటి స్పేస్, రెసిడెన్షియల్ లగ్జరీ ఫ్లాట్లను రహేజా సంస్థ నిర్మిస్తుంది. తొలివిడతలో రూ.2,172 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రహేజా సంస్థ...8వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. $5.9 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన రహేజా సంస్థ... దేశవ్యాప్తంగా కమర్షియల్ ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, రిటైల్, మాల్స్ సెగ్మెంట్ లో కీలకపాత్ర పోషిస్తోంది. మైండ్ స్పేస్ REIT ద్వారా 300కుపైగా ప్రధాన క్లయింట్లకు రహేజా ఐటి స్పేస్ సేవలను అందిస్తోంది.

6)వరల్డ్ ట్రేడ్ సెంటర్ (WORLD TRADE CENTRE - WTC)

విశాఖ యండాడలో కపిల్ గ్రూప్ ఆధ్వర్యంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. 7.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతికతతో డబ్య్లుటిసిని నిర్మిస్తారు. విశాఖలో నిర్మించే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ద్వారా వాణిజ్యసేవలు, నాలెడ్జి సేవలు అందిస్తారు. వ్యాపారులకు అవసరమైన పూర్తిస్థాయి సమాచారంతోపాటు నైపుణ్యాలను కూడా అందిస్తారు. ఇక్కడ వ్యాపార ప్రతినిధులు, భాగస్వాములకు సంబంధించి బిజినెస్ నెట్ వర్కింగ్, మార్కెట్ యాక్సెస్ లతో కన్సల్టింగ్ నెట్ వర్క్ తో అనుసంధానం చేస్తారు. ప్రాంతీయ, జాతీయ అభివృద్ధికి దోహదపడే పరిశ్రమలకు విశాఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మద్దతునిస్తుంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడుల ఆకర్షణ, హైవాల్యూ జాబ్ క్రియేషన్ లక్ష్యాలుగా ఏర్పాటవుతున్న ఈ సంస్థ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది