AI Data Center In Visakhapatnam: విశాఖపట్నం: విశాఖపట్నం సిటీలో పలు కీలక ప్రాజెక్టుల ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శంకుస్థాపన చేశారు. మొదటి ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌కు ఆదివారం ఉదయం నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్రముఖ డిజిటల్‌ ఐటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ సిఫీ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్‌ స్పేసెస్‌ లిమిటెడ్‌ విశాఖలో 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్‌ డేటా సెంటర్‌ (AI Data Center) తో పాటు ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తోంది.

సిఫీ టెక్నాలజీస్‌ నాస్‌డాక్‌లో నమోదైన కంపెనీ. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ దాదాపు రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనుంది. ఈ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుతో గ్లోబల్‌ డిజిటల్‌ గేట్‌వేగా విశాఖపట్నం నగరం మారుతుందని నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో వెయ్యి మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభించనుందని ప్రభుత్వం తెలిపింది.