<p>Village Secretariats to Vision Units: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గ్రామ సచివాలయాల పేరును 'విజన్ యూనిట్స్'గా మారుస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక నుంచి ఈ యూనిట్లు ప్రజలకు సేవలు సమర్థవంతంగా అందించే కేంద్రాలుగా రూపొందుతాయని ప్రకటించారు. రాష్ట్రంలోని 13,326 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ మార్పు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వచ్చిన 'స్వర్ణాంధ్ర విజన్ 2047'కు అనుగుణంగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. </p>
<p>అమరావతిలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. గ్రామ సచివాలయాలను మరింత ఎఫెక్టివ్‌గా మార్చాల్సి ఉందని.. చంద్రబాబు భావిస్తున్నారు. ఇక నుంచి వీటిని 'విజన్ యూనిట్స్'గా పిలుస్తామని.. ఇవి ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా మాత్రమే కాకుండా, గ్రామీణ వికాసానికి విజనరీ ప్లాన్‌లు రూపొందించే యూనిట్లుగా పనిచేయాలని <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> భావిస్తున్నారు. </p>