Vishwanath And Sons Movie Review In Telugu: కోలీవుడ్ స్టార్ సూర్య, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు జంటగా నటించిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. 'లక్కీ భాస్కర్' ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశారు. రిలీజుకు ముందు సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. అమెరికాలో ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యాయి. మరి ఎన్నారై ఆడియన్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయి? ట్విట్టర్ టాక్ ఏమిటి? అనేది ఒక్కసారి చూడండి.

సూర్య నటనకు ఎవరైనా సరే ఫిదా
మమితా బైజు కూడా చక్కగా చేసింది!
సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య నటనకు ఆడియన్స్ ఎవరైనా సరే ఫిదా అవుతారని అమెరికాలో సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. ఆయన సెటిల్డ్ అండ్ సాలిడ్ పెర్ఫార్మన్స్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్ళిందట. ఆయన క్లాసీ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అంటున్నారు.

సూర్య తర్వాత మమితా బైజు. 'ప్రేమలు'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళీ భామ కూడా తన నటనతో ఇంప్రెస్ చేసిందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా యువతను, కుటుంబ ప్రేక్షకులకు ఆమె చేసే అల్లరి అమితంగా నచ్చుతుందట. సూర్య, మమిత జంట చేసే సందడి, వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వచ్చాయట. సూర్య తల్లి పాత్రలో రాధికా శరత్ కుమార్ నటన, ఆమెతో సూర్య కాంబినేషన్ సీన్స్ బాగా నవ్వించాయట.

Also Read: Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్

వెంకీ అట్లూరి డైలాగులకు క్లాప్స్ పక్కా!
'లక్కీ భాస్కర్' రిలీజైనప్పుడు అందులో డైలాగుల గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడారు. దర్శకుడు వెంకీ అట్లూరికి డైలాగ్ రైటర్ గా నేషనల్ అవార్డు కూడా తెచ్చింది ఆ సినిమా. ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో డైలాగులు కూడా ఆయన అదరగొట్టారట.

Also Read: Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?

కొత్త కథ... ఎమోషన్స్ & ఎంటర్టైన్మెంట్!
ప్రేక్షకులు తెరపై ఇప్పటి వరకు చూడని కొత్త కథను దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారని ప్రీమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త కథను చాలా వినోదాత్మకంగా చెప్పారని, అంతే కాకుండా వినోదాన్ని భావోద్వేగాలతో మిళితం చేసిన తీరు బావుందని టాక్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఫీల్ ఇచ్చే ఫ్యామిలీ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' అని టాక్. ఫస్ట్ హాఫ్ అంతా వినోదంతో సాగితే... సెకండ్ హాఫ్ అంతటా ఎమోషన్స్ డామినేట్ చేశాయని, ఎండింగ్ అదిరిందని ప్రీమియర్స్ అండ్ పబ్లిక్ రిపోర్ట్.

Also Read: Bigg Boss Agnipariksha Contestants List 2026 - 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?