Girlfriend Cheating: కర్ణాటకలోని మంగళూరులోని ఒక లాడ్జిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల అభిషేక్ సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ప్రేమించిన యువతికి ఆల్రెడీ పెళ్లి అయిందని కానీ ఆ విషయాన్ని దాచి పెట్టి తనతో శారీరక సంబంధం కొనసాగించిందని .. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోవడంతో ప్రాణం తీసుకుంటున్నానని ఓ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా అప్ లోడ్ చేశాడు.

చెన్నైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో అభిషేక్ సింగ్ పని చేస్తున్నారు. కంపెనీ తరపున ఒక ఎగ్జిబిషన్‌కు హాజరు కావడానికి మంగళూరు వెళ్లిన ఆయన బస చేసిన లాడ్జిలో ఉరివేసుకుని కనిపించాడు. ఆమె వివాహిత అని, పిల్లలకు తల్లి అని తనకు తెలియదన్నారు. తనతో వివాహేతర బంధం పెట్టుకుని తనను ఇబ్బందుల్లోకి నెట్టిందని వీడియోలో అభిషేక్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఆదే సమయంలో ఆ మహిళ తన నుండి డబ్బు డిమాండ్ చేసిందని, నిరాకరిస్తే తన కంపెనీకి తెలియజేస్తానని బెదిరించిందన్నారు. తాను వారి ఉచ్చులో పడ్డాననని తనకు చావు తప్ప మరో మార్గం లేదని కన్నీరు పెట్టుకున్నాడు. ఆ వీడియోను తన మరణ వాంగ్మూలంగా చూడాలని కోరాడు.

అభిషేక్ సింగ్ సోదరుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మహిళ గురించి నిజం తెలిసిన తర్వాత తన సోదరుడు చాలా బాధపడ్డాడని తెలిపారు. అభిషేక్ సింగ్ తో సంబంధం పెట్టుకున్నది మోనికా సింగ్ అని గుర్తించారు. అభిషేక్ తన సోదరుడికి మోనికా తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించిందని ఆమెకు ఇప్పటికే వివాహం అయిందని తెలిసిన తర్వాత మరింతగా కుంగిపోయాడని పోలీసులకు సోదరుడు చెప్పాడు. తన సోదరుడి నుంచి మోనికా సింగ్ సుమారు రూ. 10-15 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

#OneMoreAtulSubhash from UP has ended his life in Mangaluru.

Before taking the step, he recorded a 20-minute video, blaming a CISF woman officer for his death.

Monika Sihag got into relationship with Abhishek Singh by hiding her marital status.

He accused that she took… pic.twitter.com/OnVlT3UHp3

— ShoneeKapoor (@ShoneeKapoor) March 4, 2025

మార్చి 1న మధ్యాహ్నం 3.45 గంటలకు అభిషేక్ తన ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో వీడియోలు , ఫోటోలను పోస్ట్ చేశాడు, తన పరిస్థితికి మోనికా సింగ్ కారణమని ఆరోపించాడు. దీని తరువాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు మోనికా సింగ్పై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. మోనికా సింగ్ సీఐఎస్ఎఫ్‌లోపనిచేస్తారని తేలింది. దీంతో దర్యాప్తు సంస్థలు ప్రారంభించే ఏవైనా చట్టపరమైన చర్యలకు తాము సహకరిస్తామని CISF కార్యాలయం పేర్కొంది. శాఖాపరంగా కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.