Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

3 weeks ago 1
ARTICLE AD
<p>విజయవాడ: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉండి, జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దేశద్రోహం ముప్పు వ్యవహారానికి సంబంధించి విజయవాడలో కేసు నమోదైంది. పోలీసు శాఖ ఆపరేషన్ ఫైర్&zwnj;వాల్ 2026 (Operation Firewall 2026) పేరుతో ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అందులో భాగంగా పాక్ ఏజెంట్లతో లింక్ ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి కుట్రను ఛేదించింది.</p> <p>ఈ దర్యాప్తులో భాగంగా 13 మంది నేవీ సిబ్బందితో సహా మొత్తం 18 మంది అనుమానితులను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరిని పట్టుకోవడానికి, వివరాలు సేకరించడానికి 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందులో సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్&zwnj;ను విశాఖపట్నంలో అరెస్ట్ చేయగా, విశాఖ నేవీ బేస్&zwnj;లో పనిచేస్తున్న ప్రదీప్ ముఖర్జీని పోలీసులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన ప్రదీప్&zwnj;ను విజయవాడ కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ అతనికి ఈ నెల 14 వరకు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు నిందితుడ్ని విజయవాడ జైలుకు తరలించారు.&nbsp;<br /><br /></p>
Read Entire Article