Vijay Deverakonda Special Offer To Master Rohan : 'సాంప్రదాయని... సుప్పిని... సుద్దపూసనీ'... అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్ రాగానే మనకు గుర్తొచ్చేది మాస్టర్ రోహన్. '90s మిడిల్ క్లాస్ బయోపిక్'లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తన తండ్రికి మార్కులు చూపెట్టే టైంలో వచ్చే ఈ సెటైరికల్ సాంగ్‌లో ఆ అబ్బాయి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ ఒక్క సిరీస్‌తోనే రోహన్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత చాలా మూవీస్‌లోనూ నటించి తనదైన కామెడీ టైమింగ్‌తో టాలీవుడ్ ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశాడు.

తాజాగా, తిరువీర్, టీనా శ్రావ్య ప్రధాన పాత్రల్లో నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీలో కీలక పాత్ర పోషించాడు రోహన్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుండగా... మూవీ ప్రమోషన్లలో భాగంగా గురువారం జర్నలిస్టుల కోసం స్పెషల్ షో వేశారు. ఈ క్రమంలో రోహన్ తన తల్లిని పరిచయం చేస్తూ సందడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

హీరో విజయ్‌కు రిక్వెస్ట్

రీసెంట్ 'లిటిల్ హార్ట్స్' ఈవెంట్‌లో హీరో మౌళి తనూజ్ తన తల్లిదండ్రులను పరిచయం చేశాడు. ఇప్పుడు రోహన్ కూడా అలానే చేశాడు. స్టేజీపై వాళ్ల అమ్మను పిలిచి... 'మా అమ్మ అంటూ..' పరిచయం చేశాడు. అలానే తన తండ్రి బెంగుళూరులో ఉన్నాడని చెప్పాడు. సినిమాకు మంచి టాక్ రావడంతో రోహన్ సందడి అంతా ఇంతా కాదు. హీరో హీరోయిన్లకు థాంక్స్ చెబుతూనే... కల్ట్ బొమ్మ ఇచ్చామంటూ తొడకొట్టి మరీ చెప్పాడు.

'టీజర్ చూసినప్పుడే చెప్పాను. మా సినిమా హిట్ అని. లిటిల్ హార్ట్స్ మూవీ ఈవెంట్ అప్పుడే చెప్పాను. విజయ్ దేవరకొండ అన్న మా టీం మొత్తానికి రౌడీ టీ షర్టులు రెడీ చేసి పెట్టుకో.' అని అన్నాడు. దీంతో ఒక్కసారిగా ఈలలు, కేకలతో స్టేజీ మార్మోగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

నేను నీ ఫ్యాన్

ఇక మాస్టర్ రోహన్ కామెంట్స్‌కు హీరో విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు. 'రోహన్... నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ నుంచి నేను నీకు బిగ్ ఫ్యాన్. త్వరలోనే నిన్ను కలుస్తాను. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నా.' అంటూ ట్వీట్ చేశారు.

Rohann ❤️

I’ll give you whatever you want, know that I am your fan since I watched 90s. I will see you soon my boy. And wishing the entire team of #PreWeddingShow all success 🤗 https://t.co/8eLU9QRjXu

— Vijay Deverakonda (@TheDeverakonda) November 6, 2025

Also Read : 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' రివ్యూ: తిరువీర్‌కు హ్యాట్రిక్ దక్కిందా? పల్లెటూరి కామెడీ నవ్విస్తుందా?