Virosh Couple Resuming Ranabaali Shoot After Marriage : స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ పెళ్లి తర్వాత తిరిగి 'రణబాలి' మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి హడావిడి ముగియడంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని రెగ్యులర్ వర్క్స్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం.

14 రోజుల తర్వాత

రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నెల 4న హైదరాబాద్ తాజ్ హోటల్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఫ్యామిలీస్‌తో పాటు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ హాజరయ్యారు.

పెళ్లైన దాదాపు 2 వారాల తర్వాత విరోష్ ఇద్దరూ కలిసి 'రణబాలి' షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇది మూడో మూవీ. ఇద్దరూ సినిమాలోనూ దంపతులుగానే నటిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 'రణబాలి' షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుండగా... 12 నుంచి కొత్త జంట పాల్గొననున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత న్యూ కపుల్ చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. వీరి పెళ్లి సందర్భంగా 'రణబాలి'లో విరోష్ జంటపై రిలీజ్ చేసిన సాంగ్ వైరల్ అవుతోంది.

Also Read : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్

గంభీరమైన లుక్‌లో 'రణబాలి'గా విజయ్ దేవరకొండ, అమాయకమైన అందమైన లుక్‌లో అతని భార్య జయమ్మగా రష్మిక లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బ్రిటిష్ కాలం నాటి ఆ పాత తరం లుక్‌ను 100 శాతం రీక్రియేట్ చేయడం వైరల్‌గా మారింది. 'ఏందయ్యా సామీ...' అంటూ అమాయక వివాహిత తన భర్తపై చూపించే ప్రేమను అద్భుతంగా ఈ పాటలో వ్యక్తం చేశారు.