Veeramani Diwali Prank: దీపావళి సందర్భంగా స్వీట్లు తినాలని ఉందని ఎవరైనా బాక్స్ పంపాలని మదురై ఇన్‌ఫ్లూయెన్సర్‌ వీరమణికి నెటిజన్లు అనూహ్యమైన షాక్ ఇచ్చారు. స్వీట్ బాక్స్ కోసం తన అడ్రస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. ఆయనకు టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్ చివరికి రూ.70 కోట్ల మిలిటరీ ట్యాంకర్‌ను సైతం క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టి నెటిజన్లు వేధించారు. అయితే, నెటిజన్ల ప్రాంక్‌తో విసిగిపోయిన వీరమణికి క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ 'స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్'తీపి కబురు అందించి, దీనికి హ్యాపీ ఎండింగ్ ఇచ్చింది.

దీపావళి స్వీట్ల కోసం అడిగితే.. ట్యాంకర్ ఆర్డర్లు!

తమిళనాడులోని మదురైకి చెందిన కంటెంట్ క్రియేటర్ వీరమణి, దీపావళి సందర్భంగా ఎవరైనా తనకు స్వీట్లు పంపుతారనే ఆశతో తన ఇంటి చిరునామాను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. కానీ, నెటిజన్లు ఆయనకు స్వీట్లు పంపడానికి బదులుగా ప్రాంక్ చేయడం మొదలుపెట్టారు. ఆయనకు తెలియకుండానే రూ. 1.6 లక్షల విలువైన టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్ ఫోన్లు, ప్రొజెక్టర్లు, చివరికి ఏకంగా రూ.70 కోట్ల విలువైన ఆర్మీ ట్యాంకర్, జేసీబీ వంటి ఖరీదైన వస్తువులను క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆయన అడ్రస్‌కు ఆర్డర్ చేశారు. వరుసగా వస్తున్న డెలివరీలను చూసి, బిల్లులు కట్టలేక తలపట్టుకున్న వీరమణి ఆవేదనను సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పోస్ట్ చేయడంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.

Also Read: విప్రోలో రూ.లక్షల జీతం వదిలేసి వ్యవసాయం వైపు అడుగులు.. ఇప్పుడు నెలకు రూ.60 కోట్ల ఆదాయం.. 'అక్షయకల్ప' శశికుమార్ సక్సెస్ స్టోరీ!

*not* cash on delivery https://t.co/vs9nFRjaM8
— Instamart (@instamart_it) October 19, 2026

ఎంట్రీ ఇచ్చిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్

ఈ వైరల్ ట్రెండ్‌ను గమనించిన స్విగ్గీ వెంటనే స్పందించింది. తమ 'క్విక్ ఇండియా మూవ్‌మెంట్ సేల్'లో భాగంగా వీరమణికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జీలు లేకుండా ఉచితంగా స్మార్ట్‌ఫోన్, పీసీ, ప్రొజెక్టర్, ఇండక్షన్ కుక్కర్, ఇతర గృహోపకరణాలతో పాటు ఆయన మొదట ఆశపడిన దీపావళి స్వీట్ బాక్స్‌ను డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పటికే ఈ వీడియోకు 8.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక చిన్న ఆలోచన వీరమణికి మంచి స్పాన్సర్‌షిప్‌తో పాటు స్వీట్ ఎండింగ్‌ను ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: దక్షిణాదిలో తేలిపోయిన కాక్రోచ్ ఉద్యమాలు - ఉత్తరాది ట్రెండ్స్‌ను దక్షిణ భారత యువత తిరస్కరిస్తోందా?