దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi Movie). టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే మహేష్ మాత్రం మూవీ లుక్ తీయలేదు. 'వారణాసి'లో తన లుక్ నుంచి బయటకు రాలేదు. ఎందుకు? అంటే... ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

పది రోజులు షూటింగ్ చేయాలి..
ఇంకా అదొక్కటీ బాకీ ఉందమ్మా!
ఎస్‌ఎస్‌ రాజమౌళి చెప్పిన వివరాలను బట్టి... ఈ క్రేజీ సినిమాకు సంబంధించి పది రోజుల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. లాస్ట్ షెడ్యూల్ త్వరలో పూర్తి చేస్తామని దర్శక ధీరుడు చెప్పారు. ఇది మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులతో పాటు రాజమౌళి సినిమాలను ఫాలో అయ్యే ప్రేక్షకులకు ఆయనతో పెట్టుకుంటే సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాదని, చెక్కుతూ ఉండటం వల్ల ఆలస్యం అవుతుందనేది తెలిసిన విషయమే. అయితే 'వారణాసి' షూటింగ్ మాత్రం త్వరగా పూర్తి కానున్నట్టు టాక్.

Also Read: Ramayana - ఆదిపురుష్ పాటలే బెటరా? సొంత పాటలు కాపీ కొట్టిన రెహమాన్?

పది రోజుల పాటు చేయబోయే 'వారణాసి' షూటింగ్ షెడ్యూల్‌లో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ షూటింగ్ చేయాలట. రాజమౌళి సినిమా షూటింగ్ అంతటినీ ఫినిష్ చేసినా... మహేష్ ఇంట్రో సీన్ మాత్రం ఇంకా తీయలేదట. ఆ సన్నివేశాన్ని త్వరలో పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు.

Also Read: Balakrishna Koratala Siva NBK112 Movie Music Director - అనిరుధ్ రవిచందర్ కాదు... తమన్ లేడు... బాలయ్య - కొరటాల సినిమా సంగీత దర్శకుడిగా తెరపైకి కొత్త పేరు

'వారణాసి' చిత్రీకరణ పూర్తి అవ్వక ముందే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం పంపించారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి నుంచి సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్ కీలకమైన పాత్రలో సందడి చేయనున్నారు. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ, రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Dhurandhar Actor In Nani Bloody Romeo - నాని సినిమాలో 'ధురంధర్' యాక్టర్... ఢిల్లీ షూట్ అప్డేట్ ఏమిటంటే?