Rajamouli Reaction Over Varanasi Shooting Update : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ వారణాసి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ గురించి టైటిల్ గ్లింప్స్ తప్ప ఇప్పటివరకూ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ తర్వాత మెక్సికో ఈవెంట్‌లో రాజమౌళి వారణాసి గురించి మాట్లాడారు. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.

నాలుగు నెలల్లో...

మరో నాలుగు నెలల్లో వారణాసి షూటింగ్ పూర్తి చేస్తానని చెప్పారు రాజమౌళి. ఫ్రాన్స్‌లో జరిగిన ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'వారణాసి మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్ చేశాం. ముఖ్యమైన సీన్స్ షూటింగ్ కూడా పూర్తైంది. ప్రస్తుతం చిన్న చిన్న సీన్స్ షూట్ చేస్తున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేస్తాం.' అని చెప్పారు.

ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో మూవీని రూపొందించడంపైనా రాజమౌళి రియాక్ట్ అయ్యారు. ఈ స్టోరీ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో అయితేనే అద్భుతంగా ఉంటుందని... ఫస్టే అనుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ ఫార్మాట్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

#VARANASI:

We have completed a major portion of the shoot all the important big spectacle action sequences are done.

We are now into doing the smaller, interconnecting scenes so hopefully, by September, maybe a little bit into October, we should be finishing shooting.…

— Varanasi (@VaranasiMovie) June 26, 2026

Also Read : Rahul Ravindran Chinmayi : పుణె మర్డర్‌పై బాయ్ ఫ్రెండ్ మూవీ - నెటిజన్‌కు రాహుల్ రిప్లై... సెటైరికల్ క్వశ్చన్‌కు చిన్మయి కౌంటర్