Rajamouli Reaction Over Varanasi Story Janner : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పాన్ వరల్డ్ మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ 'వారణాసి'. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. టైటిల్ గ్లింప్స్‌తోనే హాలీవుడ్ రేంజ్ ప్రమోషన్స్ అందుకున్న విజువల్ వండర్ స్టోరీ రివీల్ చేశారు జక్కన్న. బ్రెజిల్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

వారణాసి అసలు స్టోరీ ఏంటంటే?

'వారణాసి' స్టోరీ తండ్రీ కొడుకుల ఎమోషనల్ ఆధారంగా సాగుతుందని ఇదివరకే రివీల్ చేసిన జక్కన్న... తాజాగా మరింత క్రేజ్ పెంచే పాయింట్ లీక్ చేశారు. వారణాసి నగరంలో ప్రారంభమైన కథ... అక్కడే ముగుస్తుందని అన్నారు. 'ఇంకా 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇది పౌరాణిక ఫాంటసీ మూవీ. తండ్రీ కొడుకుల అనుబంధం. యువతీ యువకుడు మధ్య అందమైన లవ్ స్టోరీని ఇందులో చూస్తారు.' అని అన్నారు.

అతి పెద్ద సవాల్ ఏంటంటే?

వారణాసి అంటే ఆరు లేదా ఏడు సినిమాలు ఒకే సినిమాగా రూపొందించడం వంటిదని... వాటన్నింటినీ ఒకే చిత్రంగా తీసుకురావడమే తమ ముందున్న అతి పెద్ద సవాల్ అని అన్నారు రాజమౌళి. 'వేర్వేరు కాలాల్లో జర్నీ, విభిన్న ప్రపంచాలు, ఒకే చిత్రంలో 6 – 7 సినిమాల అనుభూతి.

వారణాసి నుంచి అంటార్కిటికా, ఆఫ్రికా, కాల ప్రయాణ సన్నివేశాలు, ఉగ్రావతి గుహలు ఇలా ప్రతి సన్నివేశానికి దాని కంటూ ఒక ప్రత్యేక ప్రపంచం, సవాళ్లు ఉంటాయి. ప్రతి అంశం పూర్తిగా భిన్నంగా ఉండటం, వాటికి మిగతా వాటితో ఎలాంటి సంబంధం లేకపోవడం. ప్రతి ప్రపంచాన్ని వాస్తవికంగా సృష్టించి, దానిని తెరపై ఒక ఆకట్టుకునే దృశ్యానుభవంగా మార్చడం అనేది ఒక సవాల్.' అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Also Read : Na Wife Missing Series Trailer : వైఫ్ మిస్ అయ్యిందా? మిస్ చేశారా? - థ్రిల్లింగ్‌గా వరుణ్ సందేశ్, శ్వేతా బసు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ట్రైలర్... ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?