Rajamouli's Varanasi OTT Deal Locked : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ 'వారణాసి'. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ పాన్ వరల్డ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ టీం. ఈ బిగ్ ప్రాజెక్ట్ ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

బిగ్ ఓటీటీ డీల్

రాజమౌళి మూవీ అంటేనే ఓ క్రేజ్... అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు. వీరిద్దరి కాంబోలో డివోషనల్ టచ్ విత్ సైంటిఫిక్ ఫిక్షనల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ 'వారణాసి' అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కేవలం టైటిల్ గ్లింప్స్ కోసమే ఓ భారీ ఈవెంట్ నిర్వహించి హాలీవుడ్ రేంజ్‌లో ప్రమోషన్స్ చేశారు జక్కన్న. ఈ క్రమంలో షూటింగ్ పూర్తి కాక ముందే డిజిటల్ రైట్స్ కోసం ఫుల్ కాంపిటీషన్ నెలకొంది.

ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' 'వారణాసి' డిజిటల్ రైట్స్ ఆల్రెడీ సొంతం చేసుకుందనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. దాదాపు రూ.650 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. తెలుగు మూవీకి ఇంతటి భారీ స్థాయిలో షూటింగ్ జరుగుతుండగానే ఓటీటీ డీల్ ఫిక్స్ కావడం ఇదే ఫస్ట్ టైం అనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. తాజాగా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి భారీ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Also Read : ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు' టీజర్ - ప్రేమ, పగ, ప్రతీకారం ఎవరిపై?... డైరెక్ట్‌గా ఓటీటీలోకే స్ట్రీమింగ్