Watch Globetrotter Event Full Video: సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ లెవల్ సినిమాకు 'వారణాసి' టైటిల్ ఖరారు చేశారు. ఆ టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు రుద్ర పాత్రలో మహేష్ ఫస్ట్ లుక్ సైతం శనివారం రాత్రి విడుదల చేశారు. ఆ ఈవెంట్ వీడియో ఆ రోజు జియో హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ ఇచ్చారు. ఆ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నోళ్లు మాత్రమే అది చూశారు. ఇప్పుడు ఆ ఈవెంట్ వీడియో మీరు ఫ్రీగా చూడొచ్చు.

యూట్యూబ్‌లో 'వారణాసి' ఈవెంట్ వీడియో...
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అక్కర్లేదు, ఫ్రీగా చూడండి!
'వారణాసి' టైటిల్ రివీల్ వీడియో యూట్యూబ్‌లోకి వచ్చింది. 'వారణాసి' పేరుతో ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో వీడియో అప్లోడ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. వీడియో పబ్లిష్ చేసిన 12 గంటల్లో సుమారు 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

మహేష్ - రాజమౌళి అభిమానులతో పాటు చాలా మంది ప్రేక్షకులు జియో హాట్ స్టార్ ఓటీటీలో 'వారణాసి' టైటిల్ లాంచ్ చూశారు. ఇప్పుడు చూడని వాళ్ళతో పాటు చూసిన వాళ్ళు సైతం మరోసారి వీడియో చూస్తున్నారు.

Also Read: నయనతారకు భర్త సర్‌ప్రైజ్... బర్త్ డే గిఫ్ట్ అదిరింది విఘ్నేషూ - ఆ కారు రేటెంతో తెలుసా!?

ఫిల్మ్ ఛాంబర్ దగ్గరకు 'వారణాసి' టైటిల్ ఇష్యూ!
మహేష్ - రాజమౌళి సినిమాకు 'వారణాసి' టైటిల్ అనౌన్స్ చేయడానికి ముందు ఆది సాయి కుమార్ కథానాయకుడిగా 'రఫ్' సినిమా తీసిన దర్శకుడు సుబ్బారెడ్డి తన కొత్త సినిమాకు ఆ టైటిల్ ఖరారు చేశారు. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర రిజిస్టర్ చేయించారు. ఇప్పుడు మహేష్ - రాజమౌళి సినిమాకు టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఛాంబర్ పెద్దలను ఆశ్రయించారు. ఇక్కడ ఒక్క విషయం గమనిస్తే... 'ఎస్ఎస్ రాజమౌళిస్ వారణాసి' అని టైటిల్ అనౌన్స్ చేశారు జక్కన్న. ఆ టైటిల్ డిజైన్ గమనిస్తే... ఎస్ఎస్ రాజమౌళి అనేది చిన్నగా, 'వారణాసి' అనేది పెద్దగా కనబడుతుంది. సో... ఇష్యూ ఉండకపోవచ్చు.

Also Read: వాట్సాప్ స్కామ్ బాధితులు... మొన్న అదితి... ఇప్పుడు శ్రియ... అసలు ఏం జరిగిందంటే?

మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'వారణాసి' సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్. విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు దేవా కట్టా, ఎస్ఎస్ కాంచి రచయితలు.