Director Sanjeev Megoti Apologised Varalaxmi Sarathkumar : 'పోలీస్ కంప్లైంట్' మూవీ ప్రమోషన్లలో పాల్గొనకుండా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె కూడా రియాక్ట్ అవుతూ ఇన్ స్టా పోస్ట్ చేశారు. వివాదం ముదరడంతో డైరెక్టర్ సంజీవ్ సారీ చెప్పారు.

'సారీ వరలక్ష్మి గారు'

పోలీస్ కంప్లైంట్ షూటింగ్ టైంలో తన చేతికి గాయమైనా వచ్చి వరలక్ష్మి శరత్ కుమార్ సపోర్ట్ చేశారని చెప్పారు డైరెక్టర్ సంజీవ్. 'వరలక్ష్మి గారి కోసమే ఈ సినిమా స్టోరీ రెడీ చేసుకున్నా. షూటింగ్‌లో కానీ స్క్రిప్ట్‌లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ కాపీ లేట్ కావడం వల్ల వరలక్ష్మి గారితో ఓ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. ప్రెస్ మీట్‌లో నేను వల్గర్‌గా మాట్లాడలేదు. కొన్ని మాటలు దొర్లాయి. వాటికి వరలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నా.

ఆవిడతో మా టీంకు మంచి బాండింగ్ ఉంది. ప్రెస్ మీట్‌లో చిన్న కామెంట్ వల్ల వరలక్ష్మి ఫీల్ కావడం, నేను కూడా హర్ట్ అయ్యా. వీడియో వైరల్ అయిన తర్వాత నాకు చాలా ఫోన్స్ వచ్చాయి. ఇంకోసారి ఈ తప్పిదం జరగదు. ఈ తప్పులన్నీ మర్చిపోయి సినిమాను ఆదరించండి.' అని చెప్పారు.

Also Read : Isakapatnam OTT : ఓటీటీలోకి ఇసాకపట్నం - అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

సారీ యాక్సెప్టెడ్

దీనికి వరలక్ష్మి సారీ యాక్సెప్టెడ్ అంటూ ట్వీట్ చేశారు. 'సారీ యాక్సెప్టెడ్. న్యాయం, సత్యం ఎల్లప్పుడూ గెలుస్తాయి. ఈ విషయంలో ఇంత వేగంగా స్పదించినందుకు తెలుగు నిర్మాతల మండలికి థాంక్స్.' అని ట్వీట్ చేశారు.

Apology accepted..justice and truth will always win..
thank you to the Telugu producer council for acting so fast on the matter.. @tfpcin thank you Damodhar garu and Prasanna guru..https://t.co/u0H9ic3qNr

— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) June 11, 2026

అసలేం జరిగిందంటే?

పోలీస్ కంప్లైంట్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌కు ఆమె హాజరు కాకపోవడంపై ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సంజీవ్ రియాక్ట్ అయ్యారు. వరలక్ష్మి డబ్బింగ్‌‌కు కూడా సరిగ్గా హాజరు కాలేదని... రామ్ చరణ్ లాంటి వారే పెద్ది కోసం అంతలా ప్రమోషన్స్ చేస్తుంటే మీరెందుకు రారు? మేడమ్ అంటూ కామెంట్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కాగా... వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు.

వారికి అవసరం ఉన్నప్పుడల్లా అందుబాటులో ఉన్నానని... ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. 'మొరిగే కుక్కలు కరవవు. కరిచే కుక్కలు మొరగవు. నేను మొరగను కరుస్తా...' అంటూ ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. డైరెక్టర్ అపాలజీతో వివాదానికి చెక్ పడిందనే చెప్పాలి.

Also Read : Vishwak Sen : రెండు సినిమాలు... కార్నర్ సీట్... OYOలో ఎండింగ్ - ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.