Director Saneev Comments On Varalaxmi Sarathkumar In Police Complaint Promotions : వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'పోలీస్ కంప్లైంట్'. జూన్ 12 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంజీవ్ మెగోటి హీరోయిన్ వరలక్ష్మిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ఆమెను అడుక్కున్నా...

వరలక్ష్మి శరత్ కుమార్‌పై డైరెక్టర్ సంజీవ్ మేగోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని కూడా ప్రమోషన్స్‌కు రాలేదని అన్నారు. ఆమె సరస్వతి మూవీ కోసం డబ్బింగ్ మూడు నెలలు పెండింగ్ పెట్టారని ఆరోపించారు. 'ఇది నాకు 11వ సినిమా. కథను నమ్మి సినిమా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. 52 మంది సీనియర్ నటులతో కేవలం 45 రోజుల్లో మూవీని కంప్లీట్ చేశాం. 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' చుట్టూ స్టోరీ సాగుతుంది.

మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్‌ది ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర. ఆమె సౌకర్యం కోసం మేము అన్ని విధాలా సహకరించాం. కానీ డబ్బింగ్‌కు కూడా సరిగ్గా అందుబాటులోకి లేకుండా మాకు ఇబ్బందులు కలిగించారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ రియాక్ట్ కాలేదు. ప్రెస్‌మీట్‌కు రమ్మని అడుక్కున్నా. షూటింగ్ టైంలో ఆమె చేతికి గాయమైనా మేమే కాంప్రమైజ్ అయ్యాం. డబ్బులు తీసుకున్న తర్వాత ఇలా వ్యవహరించడం బాధాకరం. దీని వల్ల మా చిత్రానికి భారీ నష్టం జరిగింది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.' అని అన్నారు.

Also Read : NBK111 Story : NBK111 స్టోరీ ఏంటి? - స్టైలిష్ గాడ్ గ్లింప్స్... జెన్‌జీ ట్రెండ్‌లో బాలయ్య లుక్