Bhuvaraha Swami Temple
కుటుంబంలో తరచూ ఆస్తి గొడవలు జరుగుతున్నాయా?

మీకు రావాల్సిన ఆస్తి విషయంలో మోసపోయారా?

ఇంట్లో నిత్యం గందరగోళంగా అనిపిస్తోందా?

ఇల్లు నిర్మించాలి అనుకున్నా అడుగు ముందుకు పడడం లేదా?

సమస్యల వలయంలో ఉన్నాం అనిపిస్తోందా?

అయితే వీటన్నింటి నుంచీ ఉపశమనం కోసం మైసూర్ లో ఉన్న భూవరాహస్వామి ఆలయాన్ని సందర్శించమని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు

ఈ ఆలయం విష్ణువు మూడవ అవతారమైన శ్రీ వరాహ స్వామికి అంకితం చేసినది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే భూమికి సంబంధించిన వివాదాలు, ఆస్తి, గృహ నిర్మాణ సంబంధిత అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. అయితే ఒక ప్రసిద్ధ నమ్మకం ప్రకారం, వరాహ అవతారం రాహువుతో ముడిపడి ఉంటుంది. అంగారకుడి శక్తిని కలిగి ఉంటుంది. ఆలయ ప్రధాన దైవం భూవరాహనాథ స్వామి, కృష్ణశిల అనే అరుదైన నల్లరాయితో ఇక్కడ స్వామివారి రూపం చెక్కి ఉంటుంది. సుమారు 14 అడుగుల ఎత్తైన ఆయన విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఆలయానికి సంబంధించిన ప్రసిద్ధ నమ్మకాలు

ఆలయ పూజారుల ప్రకారం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, చాలా మంది భక్తులు భూవరాహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా ఆస్తి ఆలస్యం లేదా నిర్మాణ పనులలో తరచుగా అడ్డంకులు వంటి సమస్యలు ఉంటాయి.

ఆలయంలో "ఇటుక పూజ" అనే ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. భక్తులు ఇటుక పూజ చేసిన తర్వాత, వాటిని నిర్మాణ పనుల కోసం ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల నిర్మాణ పనులలో ఆలస్యం లేదా ఆస్తి వివాదాల సమస్యలు తొలగిపోతాయి.

వరాహ స్వామి ఆలయం భూమికి సంబంధించిన చట్టపరమైన కేసులను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుందని నమ్ముతారు. కొంతమంది భక్తుల ప్రకారం, ఇక్కడ క్రమం తప్పకుండా ప్రార్థనలు చేయడం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గి, రక్షణ లభిస్తుంది.

ఆలయానికి సంబంధించిన అభిషేకం ఆచారం

ఆలయంలో ఇటుక పూజతో పాటు, మరో ముఖ్యమైన అభిషేకం ఆచారం కూడా ఉంది. ఈ ఆచారంలో, భూవరాహనాథ స్వామి భారీ కృష్ణశిల విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, నిమ్మరసం, చెరకు రసం, గంగాజలం, చందనం, పసుపు, కుంకుమ వంటి పదార్థాలతో అభిషేకం చేస్తారు.

ఆలయానికి సంబంధించిన సంప్రదాయాలు

విష్ణువు అవతారమైన శ్రీ వరాహ స్వామి ఆలయం వైష్ణవ సంప్రదాయంలో తెంకలై శాఖను అనుసరిస్తుంది. ఆలయంలో ముఖ్యమైన పండుగలు, ముఖ్యంగా వరాహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజులలో అగ్నిహోత్రంతో పాటు ప్రత్యేక మంత్రోచ్ఛారణలు కూడా చేస్తారు.

మైసూర్ సమీపంలో ఉన్న శ్రీ భూవరాహస్వామి ఆలయం కర్నాటకలో మండ్య జిల్లాలో వరాహనాథ కల్లహల్లి గ్రామంలో ఉంది. ఇది హేమావతి నది ఒడ్డున ఉన్న పురాతనమైన, ప్రశాంతమైన ఆలయం. మైసూర్ నుంచి సుమార్ 70 నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. కారులో వెళితే దాదాపు రెండుగంటల సమయం పడుతుంది. మైసూర్ నుంచి KSR డ్యామ్ మీదుగా బాలేనహళ్లి , గంజిగేరే మీదుగా కల్లహల్లి చేరుకోవాలి.

మైసూర్ బస్టాండ్ నుంచి KRS డామ్ కి తరచుగా బస్సులుంటాయి. KRS లేదా బాలేనహళ్లి వద్ద దిగి అక్కడి నుంచి షేర్ ఆటోలు , లోకల్ బస్సులలో కల్లహల్లి చేరుకోవచ్చు. ప్రత్యేక బస్సులు తక్కువగా ఉంటాయి..అందుకే ముందుగా ప్లాన్ చేసుకోవాలి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.