Valentine Day 2026: గులాబీలు ప్రేమికులకే కాదు ఈ దేవుళ్లకు కూడా చాలా ఇష్టం!

2 months ago 8
ARTICLE AD

Rose Flower Importance for Worship: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. గులాబీలకు డిమాండ్ పెరుగుతుంది. సోషల్ మీడియాలోనూ గులాబీ పోస్టర్స్ సెర్చింగ్ పెరుగుతుంది. అయితే గులాబీలు కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు భక్తి విశ్వాసాలతోనూ ముడిపడి ఉన్నాయి. అందుకే వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది

గులాబీ ఆకర్షణీయమైన అందం, సువాసన, రంగు వెనుక ప్రేమ మాత్రమే కాదు  విశ్వాసం ,  భక్తితో కూడా ముడిపడి ఉంది. ప్రేమను వ్యక్తపరచడం, పుణ్యక్షేత్రంలో ఒక ప్రమాణాన్ని నెరవేర్చడం లేదా మతపరమైన ఆచారాలను నిర్వహించడం వంటివి చేసినా, గులాబీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

హిందూ మతంలో  గులాబీలు  సరస్వతి దేవి, లక్ష్మీ దేవి, విష్ణువు, ఆంజనేయుడు, బాబా ఖాటు శ్యామ్, శ్రీకృష్ణుడికి, మధురై మీనాక్షి, దుర్గా మాతకు ప్రియమైనవి అని చెబుతారు.

హిందూ మతంలోనే కాకుండా పుణ్యక్షేత్రాలులోనూ గులాబీలను సమర్పించడం ఒక ప్రత్యేక సంప్రదాయం. సూఫీ సంప్రదాయంలో ప్రేమ, గౌరవం , భక్తిని వ్యక్తపరిచే పవిత్రమైన మార్గం గులాబీలను సమర్పించడం.

గులాబీలు ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి. భగవద్గీత వంటి గ్రంథాల్లో పూలను శాశ్వతమైన భక్తికి చిహ్నాలుగా వర్ణించారు

లక్ష్మీదేవి పాదాల నుంచి గులాబీ రేకులు ఉద్భవించాయని..ఇవి సంపద, అందం, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నం అని చెబుతారు

శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి గులాబీలతో పూజ చేస్తే శుభఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం

ప్రేమ, ఆనందానికి చిహ్నం అయిన గులాబీలంటే శ్రీ కృష్ణుడికి ప్రీతి అని..అందుకే జన్మాష్టమి సమయంలో కృష్ణుడికి గులాబీలతో పూజచేయాలని చెబుతారు పండితులు

శ్రీ మహావిష్ణువు పూజలోనూ గులాబీలను వినియోగిస్తారు

తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి పూజలో భాగమవుతాయి గులాబీలు

సూఫీ సంప్రదాయంలో ప్రేమ, గౌరవం, భక్తిని వ్యక్తపరిచే పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో గులాబీలను సమర్పిస్తారు

జ్యోతిష్యుడు అనిష్ వ్యాస్ ప్రకారం...గులాబీల సువాసన శుక్రగ్రహంతో ముడిపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు సౌందర్యం, ప్రేమ, సువాలనలకు అధిపతి అందుకే గులాబీలు ఆ గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే అవి సానుకూల శక్తిని, సంపదను, సామరస్యాన్ని ఆకర్షిస్తాయి

గులాబీ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ దూరమవుతుంది, మానసిక శాంతి లభిస్తుంది

వాస్తుప్రకారం ముళ్ల మొక్కలు ఇంట్లో పెంచకూడదు అని చెబుతారు. ముళ్లున్న మొక్కలుంటే ఇంట్లో ప్రతికూలత పెరుగుతుందని, వివాదాలు జరుగుతాయని చెబుతారు.  కానీ గులాబీ ఇందుకు మినహాయింపు..ఎందుకంటే సువాసన, సౌందర్యం దీని ప్రత్యేకత

గులాబీలు ప్రేమ, అందం, ఉత్సాహాన్ని సూచిస్తాయి. ఇంట్లో గులాబీ మొక్కలు పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. పింక్ గులాబీ లక్ష్మీదేవికి ప్రీతికరం..ప్రతి శుక్రవారం పూజలో గులాబీలు ఉపయోగిస్తే మంచి ఫలితాలు

నైరుతి దిశలో గులాబీ మొక్కలు పెంచడం సంపదకు ఆహ్వానం అని నమ్మకం

ఈశాన్యం లేదా తూర్పు దిశలో గులాబీ మొక్కను పెంచడం వల్ల ఇంటి సానుకూలత పెరుగుతుంది

గులాబీ మొక్కలను ఎప్పుడూ ఆరోగ్యంగా, పూలతో ఉంచండి. వాడిపోయిన లేదా ఎండిపోయిన గులాబీలను ఇంట్లో ఉంచకూడదు..ఎండిన మొక్కలు ఇంట్లో ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయని చెబుతారు వాస్తు నిపుణులు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Read Entire Article