Vaibhav Sooryavanshi not attends 10th Exams: టీమ్ ఇండియా ICC అండర్-19 ప్రపంచ కప్ 2026 టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. గత ఏడాది నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు ఈ టీనేజ్ సంచలనం. ఇటీవల వైభవ్ సూర్యవంశీ 10వ తరగతి పరీక్ష రాయబోతున్నాడని వార్త వచ్చింది. తాజా సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ పరీక్షలకు హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని క్రికెటర్ వైభవ్ తండ్రి స్వయంగా తెలిపారు.

వైభవ్ సూర్యవంశీ టెన్త్ ఎగ్జామ్స్ రాయడు

తాజ్‌పూర్ లోని మోడెస్టీ పాఠశాల ప్రిన్సిపాల్ ఆదర్శ్ కుమార్ అలియాస్ పింటూ మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ తండ్రితో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) బిజీ షెడ్యూల్ కారణంగా వైభవ్ పరీక్షలు రాయలేకపోతున్నాడని, అయితే అతని ప్రిపరేషన్స్, ఎగ్జాట్ సెంటర్ సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని ఆయన అన్నారు. మొదట తాను పరీక్షలకు హాజరు కావాలని బీసీసీఐని పర్మిషన్ అడిగాడని వార్తలు వచ్చాయి. కానీ అండర్ 19 టీం బిజీ షెడ్యూల్స్, మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేందుకు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయడం లేదని తెలుస్తోంది.

అడ్మిట్ కార్డు కూడా జారీ

తాజా సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఎగ్జామ్ సెంటర్ పోడ్డార్ ఇంటర్నేషనల్ స్కూల్, సమస్తిపూర్ లో ఉంది. స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వైభవ్ అడ్మిట్ కార్డు వచ్చిందని, అన్ని అవసరమైన డాక్యుమెంట్లు స్కూల్ యాజమాన్యం వద్ద భద్రంగా ఉంచామని చెప్పారు. వైభవ్ సాధారణ విద్యార్థిలాగే పరీక్షకు వస్తాడని, అతని కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు ప్రారంభం

10వ, 12వ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అదే స్కూల్లో రెండు తరగతులకు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే, వైభవ్ పరీక్షకు హాజరుకాడని తాజాగా స్పష్టమైంది. అయితే వైభవ్ క్రేజ్ దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చలు జరిగాయి. స్కూల్ యాజమాన్యం ఈ విషయంపై స్థానిక అధికారులకు సమాచారం సైతం అందించింది. స్కూల్ బయట సెక్యూరిటీ బాధ్యతను పోలీసులకు అప్పగించింది. అయినప్పటికీ, ఒక విద్యార్థి కోసం ప్రత్యేక భద్రతను అందించబోమని, ఎగ్జామ్ సెంటర్‌లో అందరు విద్యార్థులకు వర్తించే రూల్స్ వైభవ్ కు ఉంటాయని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది.