Uttarayana Punyakalam 2026: 2026 సంవత్సరంలో జనవరి 15 శుక్రవారం సంక్రాంతి వచ్చింది. ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. 2026 జనవరి 14 రాత్రి 8 గంటల 43 నిముషాలకు మకర రాశిలోకి అడుగుపెడతాడు. జనవరి 15 సూర్యోదయానికి ఉత్తరాయణం సందర్భంగా మకర సంక్రాంతి జరుపుకుంటారు.

'సరతి చరతీతి సూర్యః' సంచరించేవాడు అని దీని అర్థం

సూర్యభగవానుడి సంచారం 2 విధాలుగా ఉంటుంది. మానవులకు ఏడాది కాలం అంటే దేవతలకు ఓ రోజుతో సమానం. అంటే మనకు సంవత్సరం అంటే దేవతలకు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రితో సమానం. మనం పగలు దేవతలకు ఉత్తరాయణం, మన రాత్రి దేవతలకు దక్షిణాయనం.

'ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత'

సంక్రమణం అంటే?

సంక్రమణం అంటే మారడం, చేరడం అని అర్థం. సూర్యుడు మేషం నుంచి 12 రాశులల్లో మారుతూ పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి అడుగుపెట్టడమే సంక్రమణం. ఏ రాశిలో అడుగుపెడితే ఆ సంక్రాంతి వస్తుంది. మకరంలోకి వచ్చినప్పుడు మకర సంక్రాంతి అవుతుంది. ఈ రోజు ఎవరైతే సూర్యభగవానుడు ఉదయించేలోగా నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి నమస్కరిస్తారో వారి దారిద్ర్యం తొలగిపోతుంది. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి

ఉత్తరాయణం పుణ్యకాలం అని ఎందుకంటారు?

ఉత్తరాయణం పుణ్యకాలం అని పిలిస్తే..మరి దక్షిణాయనం పాపకాలం అవుతుందా అనే సందేహం రావొచ్చు. కానేకాదు..దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం దేవతలకు పగటి సమయం కావున ఈ సమయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు అనువైన సమయం. తీర్థయాత్రలు చేసేవారంతా బయలుదేరేది ఈ సమయంలోనే. ఇక దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం.. వాతావరణంలో చాలా మార్పులుంటాయి. ఈ సమయంలో పితృదేవతల స్మరణ ద్వారా కుటుంబానికి మంచి జరుగుతుంది.

వేదాల్లోనూ నార్త్ కే ప్రయార్టీ ఎక్కువ

దక్షిణ దిక్కుకి అధిపతి యముడు అయితే ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే దక్షిణం కన్నా ఉత్తర దిక్కుని పవిత్రమైనదిగా భావిస్తారు. వేదాల జననం కూడా ఉత్తర భూముల్లోనే జరిగింది. హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత అంతా ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చింది. సమస్తభాషలకు అమ్మ అయిన సంస్కృతం ఉత్తరాదిన పుట్టింది. సమస్త రుషులు, దేవతలు, పండితులకు ఉత్తర భూములే నివాస స్థలాలు కావడంతో పాటూ..సూర్యుడు ఉత్తరంవైపు చలనం చేయడం కూడా ఇది పుణ్యకాలంగా భావిస్తారు

దేవతలు ఉత్తరాయణంలో నిద్రలేచే సమయం..ఈ సమయంలో భక్తిపూర్వకంగా ఏం కోరుకున్నా నెరవేరుతుందని చెబుతారు. ఆ ఉద్దేశంతోనే ఉత్తరాయణం ప్రారంభం అవగానే వచ్చిన సంక్రాంతిని పెద్దపండుగగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి రోజున పితృ తర్పణాలు విడిస్తే వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని నమ్మకం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Happy Bhogi 2026: భోగి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో చెప్పండి!

<a title="Makar Sankranti 2026 Wishes: మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ శ్లోకాల ద్వారా తెలియజేయండి!" href="https://telugu.abplive.com/spirituality/happy-makar-sankranti-2026-wishes-greetings-images-photos-free-download-to-share-with-friends-family-in-telugu-233927" target="_self">Makar Sankranti 2026 Wishes: మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ శ్లోకాల ద్వారా తెలియజేయండి!