Pawan Kalyan's New Poster From Ustaad Bhagat Singh Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌‌కు గూస్ బంప్స్ పక్కా. ఆయన బర్త్ డేకు ఒక రోజు ముందుగానే సర్ ప్రైజ్ ఇచ్చేశారు 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్. స్టైలిష్ లుక్‌లో పవన్ అదరగొట్టారు. పోస్టర్ ట్రీట్ అదిరిపోయిందని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నేను అలా చూడాలనుకుంటున్నా

'హ్యాపీయెస్ట్ బర్త్ డే. నా బ్రదర్. నా ఇన్‌స్పిరేషన్. నా హీరో. ఒకే ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్. నేను అతన్ని ఇలా చూడాలనుకుంటున్నా. మీకు ఇది నచ్చుతుందని ఆశిస్తున్నా.' అంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ వేరే లెవల్‌లో ఉంది. ఓ పెద్ద క్లాక్ బ్యాక్ డ్రాప్‌లో స్టైల్‌గా టోపీ పెట్టుకుని పవర్ స్టార్ డ్యాన్స్ స్టెప్ వేస్తున్నట్లుగా ఉన్న లుక్ అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ పవన్‌ను చూస్తున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'దటీజ్ పవర్ స్టార్', 'ఇక థియేటర్స్‌ దద్దరిల్లడం ఖాయం' అంటూ చెప్పారు.

Also Read: నెక్స్ట్ ఇయర్ నుంచి వరుసగా మూవీస్ చేస్తా బ్రో - రానాతో స్వీటీ అనుష్క ఫోన్ కాల్... ఏంటీ నీకు పెళ్లా?