Devi Sri Prasad About Ustaad Bhagat Singh Songs: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ బర్త్ డే సందర్భంగా రీసెంట్‌గా రిలీజ్ చేసిన వింటేజ్ స్టైలిష్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఓ సాంగ్‌లో స్టెప్‌తో ఆ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క పోస్టర్‌తోనే మూవీలో పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయని అర్థమవుతోంది.

తాజాగా ఉస్తాద్‌లో సాంగ్స్‌పై మ్యూజిక్ మాస్ లెజెండ్ దేవిశ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దుబాయ్ వేదికగా జరిగిన 'సైమా 2025' వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందంటూ చెప్పారు. దీంతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ షేక్ హ్యాండ్...

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రీసెంట్‌గానే ఓ సాంగ్ షూట్ చేసినట్లు దేవిశ్రీ తెలిపారు. 'పవన్ సూపర్‌గా డ్యాన్స్ చేశారు. సాంగ్ షూట్ అయిన తర్వాత పవన్ కల్యాణ్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అదరగొట్టేశావ్ దేవి. చాలా కాలం తర్వాత నాకు డ్యాన్స్ చేయాలనే కోరిక కలిగించావ్. నాతో డ్యాన్స్ చేయిస్తున్నావ్ నువ్వు అంటూ ప్రశంసించారు. అది విన్న వెంటనే నాకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది. ఈ మూవీ సాంగ్స్, పవన్ డ్యాన్స్ అందరికీ ఎల్లప్పటికీ గుర్తుండిపోతుంది.' అంటూ చెప్పారు.

Also Read: 'సైమా అవార్డ్స్ 2025' విన్నర్స్ లిస్ట్: 'పుష్ప 2'కు నాలుగు... సత్తా చాటిన 'కల్కి', 'హనుమాన్'