US Tariffs on India: భారత ప్రధాని మోదీతో చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మార్కెట్‌కు బూస్ట్

2 months ago 3
ARTICLE AD

వాషింగ్టన్: భారత్ మీద 50 శాతం టారిఫ్ అమలుచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను పరిష్కరించడానికి, వాణిజ్య ఒప్పందం కోసం తమ ప్రభుత్వం భారతదేశంతో చర్చలు కొనసాగిస్తోందని తెలిపారు. చైనాకు భారతదేశాన్ని కోల్పోయానని కామెంట్ చేసిన కొన్ని రోజులకే భారత్ తో ట్రేడ్ డీల్ కోసం చూస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్ చేశారు. "చాలా మంచి స్నేహితుడు అయిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో త్వరలో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాను. ఈ చర్చలు రెండు దేశాలు కోరుకున్న ఫలితాన్ని ఇస్తాయనే నమ్మకం ఉందన్నారు.

“భారతదేశం, అమెరికా దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను పరిష్కరించడానికి చర్చలు కొనసాగుతాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను. మన రెండు గొప్ప దేశాలకు విజయవంతమైన ముగింపు లభిస్తుంది” అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ లు చైనాలోని టియాంజిన్ లోని SCO సమ్మిట్ లో ఇటీవల సమావేశం అయ్యారు. భారతదేశం, రష్యా దేశాలను  చైనాకు కోల్పోతున్నామని ట్రంప్ ఆ సమయంలో అన్నారు. చైనాలో జరిగిన సమ్మిట్ లో ముగ్గురు నేతలు కలిసి దిగిన ఫోటోను కూడా ట్రంప్ షేర్ చేశారు.

అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఇదే సమయంలో జీఎస్టీ స్లాబ్స్ సైతం తగ్గిస్తున్నట్లు ప్రకటించడం అమెరికా బిగ్ షాకిచ్చినట్లు అయింది. దాంతో ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. ప్రధాని మోదీని "గొప్ప ప్రధాన మంత్రి" అని సంబోధించారు. తాము ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ ట్రంప్ మనోభావాలను గౌరవిస్తున్నాం. ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.

US President Donald Trump posts, "I am pleased to announce that India, and the United States of America, are continuing negotiations to address the trade barriers between our two nations. I look forward to speaking with my very good friend, Prime Minister Modi, in the upcoming… pic.twitter.com/pDBB4KZh46
— ANI (@ANI) September 9, 2025

గత వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ..  అమెరికా వస్తువులపై సున్నా శాతం సుంకాలు తగ్గించడానికి భారతదేశం ప్రతిపాదించిందని అన్నారు. అయితే, ఈ ప్రతిపాదన ఆలస్యమైందని, ఈ చర్యను చాలా సంవత్సరాల క్రితమే తీసుకోవాల్సిందన్నారు. భారతదేశ వాణిజ్య విధానాలను, రష్యాతో ఇంధన సంబంధాలను ట్రంప్ పలుమార్లు విమర్శించారు.

నెలల తరబడి భారత్ మీద విషం చిమ్ముతున్న అమెరికా అధ్యక్షుడు భారత్ తో చర్చలకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. భారత్, అమెరికా ప్రతినిధులు చర్చించి వాణిజ్య ఒప్పందం చేసుకుంటారని శుభవార్త చెప్పారు. అయితే రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనసాగించడాన్ని అమెరికా జీర్ణించుకోవడం లేదు. అందుకే 25 శాతం అదనపు సుంకాలు భారత్ మీద విధించడం తెలిసిందే.

భారత ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ సుంకాలు ఈ ఏడాది భారతదేశ జిడిపిలో 0.5 శాతం తగ్గించవచ్చని అన్నారు. యుఎస్ సెన్సెస్ బ్యూరో డేటా ప్రకారం, 2024 లో అమెరికా-భారత్ మధ్య వాణిజ్యం విలువ 129 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో వాషింగ్టన్ 45.8 బిలియన్ డాలర్ల లోటును నమోదు చేసింది.

Read Entire Article