US journalist fired after post on Indian Origin CEO : అమెరికాలో H-1B వీసా వివాదాలు , భారతీయ టెక్ కార్మికులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారు పెరుగుతున్నారు. భారత మూలాలు ఉన్న ఓ కంపెనీ సీఈవో కృతి పటేల్ గోయల్‌పై ద్వేషపూరిత కామెంట్ చేసిన అమెరికన్ జర్నలిస్ట్ మ్యాట్ ఫోర్నీకి ఉద్యోగం పోయింది. ‘ప్రతి భారతీయుడినీ డీపోర్ట్ చేయండి’ అంటూ X (ట్విటర్)లో పోస్ట్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వచ్చింది. H-1B , భారతీయ సమస్యలపై రిపోర్టింగ్ చేయడానికి అతన్ని నియమించిన మీడియా సంస్థ ‘ది బ్లేజ్’ ఒక వారంలోనే అతన్ని తొలగించింది.

Etsy కంపెనీ, ప్రపంచంలోని పెద్ద ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్. ఈ కంపెనీ ప్రెసిడెంట్ , చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కృతి పటేల్ గోయల్‌ను జనవరి 1, 2026 నుంచి CEOగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. భారత మూలాల గోయల్ మునుపు Depop కంపెనీ CEOగా పనిచేసి, ఆ కంపెనీని TIME మ్యాగజైన్‌లో ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ కంపెనీలు’లో చేర్చారు. ఆమె ఇప్పటి వరకూ Etsyలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, వయాకాం, ప్రొడక్ట్ (RED), మోర్గాన్ స్టాన్లీ, జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్‌లో పని చేసిన అనుభవం ఉంది.

ఈ విషయంపై కృతి పటేల్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. అయితే జర్నలిస్టు మరో అర్హత లేని భారతీయుడు అమెరికన్ కంపెనీని తీసుకుంటున్నారు.. కంపెనీలో ఆమె మొదటి చర్య అమెరికన్లను తొలగించి, భారతీయులతో భర్తీ చేయడమే.. DEI: ప్రతి భారతీయుడినీ డీపోర్ట్ చేయండి” అని పోస్ట్ చేశాడు. ఇది 15,000కి పైగా లైక్‌లు, 2,000 రీపోస్టులు పొందింది. కానీ భారతీయ సమాజంలో ఆగ్రహం రేగింది.

నవంబర్ 4న ఫోర్నీ తన Xలో ‘ది బ్లేజ్’లో ఉద్యోగం పొందినట్లు ప్రకటించాడు. నవంబర్ 5-7న పోస్ట్ వైరల్ అయ్యేసరికి సోషల్ మీడియాలో ఆగ్రహం పెరిగింది. భారతీయ అమెరికన్లు మరియు DEI మద్దతుదారులు ఫోర్నీని ‘జాతి విద్వేషకుడు’ అని ఆరోపించారు. ది బ్లేజ్ అతని ‘ఆందోళనకరమైన’ ట్వీట్ల కారణంగా అతన్ని తొలగించింది.

I have been let go from THE BLAZE. My Tweeting was cited as "concern[ing]." I was not given specific examples of Tweets that they were "concerned" about and THE BLAZE had reached out to me BECAUSE of my Tweeting in the first place.

I wish them well and have no further comment.

— Matt Forney (@realmattforney) November 6, 2025

ఫోర్నీ మునుపటి పోస్టుల్లో భారతీయులను ‘కరప్ట్’, ‘అసమర్థులు’, ‘దేశ భద్రతకు ముప్పు’ అని అవమానించాడు. ఉదాహరణకు, USAలో దీపావళి జరుపుకోవడాన్ని ఎగతాళి చేసి, “వెటరన్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు” అని రాశాడు. Coinbase డేటా లీక్‌ను భారతీయులపై నింద వేసి, “మీ డేటా సురక్షితం కాదు” అని చెప్పాడు. దీపావళి, డెల్టా ఎయిర్‌లైన్స్ IT, ఫ్రెడీ మ్యాక్‌లో భారతీయులపై చాలా పోస్టులు చేశాడు. వింత ఏమిటంటే, ఫోర్నీని H-1B సమస్యలపై రిపోర్టర్‌గా నియమించిన ‘ది బ్లేజ్’ అతని ద్వేషపూరిత మాటలకు బాధ్యత వహించాల్సి వచ్చింది.

ఫోర్నీ ఉద్యోగం పోయిన తర్వాత Xలో, “ది బ్లేజ్ నా ట్వీట్లు ఆందోళనకరమని చెప్పలేదు, కానీ సోషల్ మీడియా యాక్టివిటీ గురించి మాట్లాడింది” అని రాశాడు. కొందరు అతనికి మద్దతు ఇచ్చారు ఈ ఘటన అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతి విద్వేష ట్రోలింగ్‌కు ఉదాహరణ. Etsy లేదా గోయల్ నుంచి ఎలాంటి స్పందన లేదు.