Matching grants scam in America Apple Company: అమెరికాలో యూపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం చేసే తెలుగువారిలో కొంత మందిని తొలగించినట్లుగా రెండు, మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగగుతోంది. తెలుగువారి పరువు తీశారని..అదని ఇదని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో తెలుగు సంఘాలకు లింక్‌లు ఉన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ఇది తెలుగువారు, తెలుగు సంఘాలతో కలిసి చేసిన స్కామ్ కాదు. యాపిల్‌లో చాలా మంది ఉద్యోగులు ఇలాంటి అవకతవకలకు పాల్పడటంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అలాంటివారిలో కొందరు తెలుగువారు.

మ్యాచింగ్ గ్రాంట్ ను దుర్వినియోగం చేశారని ఆరోపణలు !

యాపిల్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా ఉద్యోగులకు సామాజిక సేవా కార్యక్రమాలకు కొన్ని నిధులు ఇస్తుంది. ఉద్యోగులు కూడా ఈ రెస్పాన్సిబులిటీ కింద కొంత మంది విరాళాలు ఇవ్వాలి. తాము కేటాయించే మొత్తానికి యాపిల్ కంపెనీ ఇచ్చే మ్యాచింగ్ గ్రాట్ కలిపి లాభాపేక్ష లేని సేవా సంస్థలకు ఉద్యోగులు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా విరాళంగా ఇవ్వాల్సిన నిధుల్ని ఊరూపేరు లేని సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించి..తామే ఉంచుకున్నారన్నది ప్రధానంగా ఉద్యోగులపై ఆరోపణ. యాపిల్ ప్రధాన కార్యాలయంలో పని చేసే రెండు, మూడు వందల మందిపై ఇలాంటి అభియోగాలు రావడంతో ఆ కంపెనీ విచారణ జరిపింది.

నిజమని తేలడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై క్రమశిక్షణా చర్లు

అంతర్గత విచారణలో విషయం బయటకు రావడంతో ఉద్యోగులపై యాపిల్ కంపెనీ చర్యలు తీసుకుంది. స్వచ్చందంగా రాజీనామా చేస్తారా లేకపోతే తీసివేయమంటారా అని ఆఫర్ ఇచ్చింది. ఫలానా ఆరోపణ కింద యాపిల్ కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకోవడం ఎందుకని చాలా మంది స్వచ్చందంగా రాజీనామా చేశారు. కొంత మందిని యాపిల్ కంపెనీ తొలగించింది. ఈ లే ఆఫ్‌లను ఆధారంగా చేసుకుని తెలుగువారిపై.. తెలుగు ఉద్యోగులపై ఇష్టం వచ్చినట్లుగా బురద చల్లేస్తున్నారు.

Also Read: Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం

ఉద్యోగుల్ని తగ్గించుకోవడానికి బడా కంపెనీల టెక్నిక్ ఇది !

ఇటీవల ఫేస్ బుక్‌ సంస్థ తమ ఉద్యోగుల్లో కొంత మంది ఫుడ్ కూపన్‌లను దుర్వినియోగం చేశారని తొలగించింది. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు క్యాంటిన్ లో ఇచ్చే భోజనం నచ్చకపోతే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఫేస్‌బుక్ కూపన్లను ఇస్తుంది. ఈ కూపన్లను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉపయోగించుకున్నారని.. లేకపోతే దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఉద్యోగుల్ని తొలగించింది. ఇతర కంపెనీలు కూడా ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పుడు యాపిల్ కూడా అదే బాట పట్టింది. ఉద్యోగుల్ని తగ్గించుకునేందుకు ఏ తప్పులు చేస్తారా అని వెదికి ఇలా దొరికిన వారిని పంపేసింది. ఇందులో తెలుగు వారి కన్నా ఇతర దేశాల వారు ఎక్కువగా ఉన్నారు.కానీ తెలుగు వారిని తెలుగువారే కించపర్చేసుకుంటున్నారు.

Also Read : Justin Trudeau: అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో