Upcoming Cars in November: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో నవంబర్ 15, శనివారం చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున టాటా నుంచి మారుతి, ఫోక్స్‌వ్యాగన్ నుంచి BMW వరకు అనేక కార్ల కంపెనీలు తమ కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి. టాటా మోటార్స్ నవంబర్ 15న హారియర్, సఫారి కొత్త వేరియంట్‌లను మార్కెట్‌లో విడుదల చేయవచ్చు. అదేవిధంగా, మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కూడా ఈ రోజున భారత మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

టాటా హారియర్ (Tata Harrier)

టాటా హారియర్ 5-సీటర్ కారు. ఈ కారు గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్స్‌ భద్రతా రేటింగ్‌ను కూడా పొందింది. టాటా ఈ కారు కొత్త వేరియంట్‌ను నవంబర్ 15న మార్కెట్‌లో విడుదల చేయవచ్చు. ఈ SUV కొత్త వేరియంట్ ధర రూ. 14 లక్షల నుచి రూ. 25.25 లక్షల మధ్య ఉండవచ్చు.

టాటా సఫారి (Tata Safari)

టాటా సఫారి 6, 7-సీటర్ వేరియంట్‌లలో వస్తుంది. టాటా ఈ కారు కూడా గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్‌ భద్రతా రేటింగ్‌ను పొందింది. ఈ కారు 16.3 kmpl మైలేజీని ఇస్తుందని పేర్కొంది. టాటా మోటార్స్ నవంబర్ 15న హారియర్‌తోపాటు సఫారి కొత్త వేరియంట్‌ను కూడా మార్కెట్‌లో విడుదల చేయవచ్చు. టాటా సఫారి కొత్త వేరియంట్ ధర రూ.14.66 లక్షల నుంచి రూ. 25.96 లక్షల మధ్య ఉండవచ్చు.

2025 మారుతి బ్రెజ్జా (2025 Maruti Brezza)

మారుతి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో బ్రెజ్జా (Brezza) ఒకటి. నవంబర్ 15న ఈ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ధర రూ.8.50 లక్షల వరకు ఉండవచ్చు.

Also Read: ఆఫీసుకు వెళ్లడానికి 1 లక్ష రూపాయల పరిధిలో బైక్ కొనాలనుకుంటున్నారా? మంచి ఆప్షన్స్‌ ఏంటో చెక్ చేయండి!

మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)

మారుతి గ్రాండ్ విటారా 3-row ఆప్షన్‌తో మార్కెట్‌లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ కారులో 1490 cc 4-సిలిండర్ ఇంజిన్ ఉండవచ్చు. ఈ SUV పెట్రోల్ వేరియంట్‌లో మార్కెట్‌లోకి వస్తుంది, దీని ఇంజిన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ జత చేసింది. ఈ కారు ధర రూ. 14 లక్షల వరకు ఉండవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ టెరాన్ (Volkswagen Tayron)

ఫోక్స్‌వ్యాగన్ టెరాన్ కూడా నవంబర్ 15న మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారు 1984 cc ఇంజిన్‌తో పెట్రోల్ వేరియంట్‌లో విడుదల చేయవచ్చు. ఈ SUV ఇంజిన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జతచేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ ఈ కారు రూ.50 లక్షల ధర పరిధిలో విడుదల చేయవచ్చు.

Also Read: నవంబర్ 25న విడుదల కానున్న టాటా సియెర్రా; పవర్ ఫీచర్స్ నుంచి ధర వరకు ప్రతిదీ తెలుసుకోండి