తెలుగులో జనవరి 1న థియేటర్లలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ మలయాళ యాక్షన్ ఎంటర్టైనర్ 'మార్కో'. డిసెంబర్లోనే మలయాళ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమాకు అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో, ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అందులో భాగంగానే ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో జనవరి 1న రిలీజ్ అయింది. ఇక ఇటీవల కాలంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ (Marco OTT Release) గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఏ ఓటీటీకి మూవీని ఇవ్వలేదు
సాధారణంగా సినిమాలు థియేటర్లలోకి వచ్చి 10-15 రోజులు గడిచిపోతే చాలు... థియేటర్లలో ఆడుతున్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అదే సినిమాను కాస్త ఓపిక పడితే ఓటీటీలో చూడొచ్చు కదా అని ఆలోచిస్తారు. అదేవిధంగా తాజాగా 'మార్కో' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ను రిలీజ్ చేసి, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి క్లారిటీ ఇచ్చింది.

ఈ మేరకు ఆ పోస్ట్ లో "మార్కో మూవీ ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో పలు రూమర్లు సర్కులేట్ అవుతున్నాయి. వాటి గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. ఇప్పటికైతే మేము ఇంకా ఎలాంటి అగ్రిమెంట్ కి లేదా ఏ ఓటీటీ డీల్ కి సైన్ చేయలేదు. ఒకవేళ ఇలాంటి న్యూస్ ఏదైనా బయటకు వచ్చిందంటే, అది ఖచ్చితంగా ఫేక్ న్యూస్. మార్కో మూవీ సినీమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం క్రియేట్ చేసాము. ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఈ సినిమాను ఎంజాయ్ చేయడాలనే మేము కోరుకుంటున్నాము. ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మేం కూడా ఈ సినిమాను మిమ్మల్ని థియేటర్లలోనే చూడమని రికమెండ్ చేస్తాము. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ఇంటెన్సిటీ, విజువల్స్, సౌండ్ డిజైన్ ను ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్లో చూస్తేనే బెటర్. ఒకవేళ ఓటీటీ డీల్స్ గనక ఫైనలైజ్ అయితే, తప్పకుండా మేమే అఫీషియల్ గా ఆ న్యూస్ ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటాము. సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తాము. కాబట్టి అప్పటిదాకా మార్కో మూవీకి సంబంధించిన ఎలాంటి ఓటీటీ వార్తలను సర్కులేట్ చేయొద్దని, అలాంటి వార్తలు వచ్చినా నమ్మొద్దని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాను దగ్గరలోని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేద్దాం. ప్రతి ఒక్కరికి ఈ సినిమాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు" అంటూ సుధీర్ఘ నోట్ రిలీజ్ చేశారు నిర్మాతలు.

'మార్కో' ఓటీటీ రిలీజ్ పై రూమర్స్...
మోస్ట్ వయోలెంట్ మూవీగా తెరకెక్కిన మలయాళం మూవీ 'మార్కో' డిసెంబర్ 20న మలయాళం లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీని 45 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని టాక్ నడిచింది. జనవరి చివరలో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో 'మార్కో' మూవీ ఎక్స్టెంటెడ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా మేకర్స్ వచ్చిన క్లారిటీ ప్రకారం అవన్నీ ఫేక్ న్యూస్.

Also Read: బెస్ట్ పిక్చర్ కోటాలో 5 ఇండియన్ సినిమాలు... ఆస్కార్ నామినేషన్స్‌లో ఇండియన్ డిజాస్టర్ ఫిల్మ్