UI Review - 'యూఐ' రివ్యూ: ఇండియన్ పాలిటిక్స్‌పై ఉపేంద్ర సెటైర్... కామన్ ఆడియన్‌కు అర్థం అవుతుందా?
11 months ago 7
ARTICLE AD
Upendra's UI Movie Review In Telugu: ఉపేంద్రకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా కాదు... దర్శకుడిగా ఆయన తీసే  సినిమాలు సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటాయి. ఆల్మోస్ట్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'యూఐ'. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ఉపేంద్ర ఏం చెప్పారు? ఏముంది? అనే వివరాల్లోకి వెళితే...
కథ (UI Movie Story): జేబు దొంగ వామనరావు (రవిశంకర్) సామ్రాట్ / రాజకీయ నాయకుడు అవుతాడు. అతనికి బానిసలుగా ఉన్న ప్రజల్లో అవగాహన పెంచుతూ  కులమతాలకు అతీతంగా సమ సమాజ స్థాపన కోసం సత్య (ఉపేంద్ర), అతని తండ్రి శాస్త్రి (అచ్యుత్ కుమార్) కృషి చేస్తుంటారు. వృత్తిరీత్యా శాస్త్రి ఓ జ్యోతిష శాస్త్ర నిపుణుడు.
సత్య జన్మ నక్షత్రం ప్రకారం అతను కలియుగ భగవంతుడు అని శాస్త్రి అనౌన్స్ చేస్తారు. వామనరావును సెంట్రల్ సామ్రాట్ చేస్తానని చెప్పిన కల్కి ఏం చేశాడు? కల్కిగా వచ్చినది సత్య కాదని, సత్య ట్విన్ (కవల సోదరుడు) అని ప్రజలతో పాటు వామనరావు తెలుసుకున్నాడా? లేదా? సత్య, కల్కి మధ్య వ్యత్యాసం ఏంటి? ఈ సమాజానికి వాళ్లిద్దరూ ఏం చేశారు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (UI Movie Review Telugu): 'తెలివైనవారు మూర్ఖులుగా కనిపిస్తారు. మూర్ఖులు తెలివైన వారిగా నటిస్తారు' - సినిమా ప్రారంభంలో ఉపేంద్ర చెప్పిన మాట (అంటే స్క్రీన్ మీద వచ్చే లైన్స్). ఆ సెంటెన్స్ మీనింగ్ తెలిస్తే మీకు ఈ సినిమా అర్థం అవుతుంది. ఫోకస్ చేయగలుగుతారు. లేదంటే అర్థం కాకపోవచ్చు.
'యూఐ' అర్థం కావాలంటే... సగటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై ప్రేక్షకులకు అవగాహన చాలా ముఖ్యం. టీవీ డిబేట్స్ మీద కూడా! ఓ రచయితగా, దర్శకుడిగా ఉపేంద్ర ఈ సినిమాలో చాలా అంశాలు డిస్కస్ చేశారు. అయితే... ఒక్క పాయింట్ కూడా డైరెక్టుగా చెప్పలేదు. ఉదాహరణకు... ఒక ఆఫ్గనీకి ఇద్దరు భార్యలు అని, ఒకరిది రష్యా అయితే మరొకరిది అమెరికా అని, ఒక రోజు ఆఫ్గన్ దగ్గర డబ్బులు తీసుకుని ఇద్దరూ వెళ్లిపోయారని ఓ సన్నివేశంలో చెబుతాడు. అది ఆఫ్గనిస్తాన్ గడ్డపై జరిగిన తీవ్రవాద పోరు గురించి రష్యా, అమెరికాలను ఉద్దేశిస్తూ ఆ విధంగా చెప్పారు. న్యూస్ ఛానళ్లలోని డెబేట్లలో కులమతాల ప్రతినిధులు కొట్టుకునే తీరునూ ఉపేంద్ర ఎండగట్టారు.
ఉపేంద్ర రచనలో డెప్త్ ఉంది. ప్రజెంట్ పొలిటికల్ సినారియో మీద ఆయన వేసిన బిగ్గెస్ట్ సెటైర్ 'యూఐ'. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు పబ్బం గడుపుతున్నారని పరోక్షంగా చెప్పారు. గుడ్ వర్సెస్ బ్యాడ్ (మంచి, చెడు మధ్య వ్యత్యాసం) గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పారు. కానీ, ఒక్కటంటే ఒక్క సీన్ కూడా కామన్ ఆడియన్ / సగటు ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా లేవు. ఒక్క సన్నివేశంలో లాజిక్ లేదు. అన్నిటి కంటే ముందు స్క్రీన్ మీద ఏం జరుగుతుందో తెలియదు. కంగాళీ కంగాళీగా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఎందుకు ఉందో అర్థం కాదు. ఆమె క్యారెక్టర్ ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారో అర్థం కాదు. సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ అదే.
Also Read: 'బచ్చల మల్లి' రివ్యూ: హీరోకి యూనిక్ క్యారెక్టర్ ఒక్కటే చాలా... సినిమాకు కథ, ఎమోషన్స్ అవసరం లేదా?
'యూఐ' అవుట్ అండ్ అవుట్ టిపికల్ ఉపేంద్ర సినిమా. నటుడిగా నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రెండు క్యారెక్టర్ల మధ్య డిఫరెన్స్ బాగా చూపించారు. ఒక ఇంటెన్స్, డెప్త్ ఉన్నాయి ఆయన నటనలో! అయ్యప్ప శర్మ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. తన పాత్ర వరకు ఆయన బాగా చేశారు. మిగతా క్యారెక్టర్లలో ఒక్కరి నటన కూడా రిజిస్టర్ అయ్యేలా లేదు.
మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపొమ్మని స్టార్టింగ్ చెబుతారు ఉపేంద్ర. ఇంటెలిజెంట్ అనుకుంటే థియేటర్లలో ఉండాలి. లేదంటే బయటకు వచ్చేయడం బెటర్. ఉపేంద్ర టిపికల్ సీన్స్ సగటు ప్రేక్షకుడి ఐక్యూకి అందనంత ఎత్తులో ఉంది.
Also Read: విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Read Entire Article