Types of Salt for Cooking : వంటలో ఉప్పు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందట ఉప్పు. అయితే ఉప్పు మంచి రుచిని ఇస్తుంది కానీ.. ఎక్కువగా దానిని తీసుకోకపోవడమే మంచిదంటారు నిపుణులు. అలాగే కొందరు రెగ్యులర్ ఉప్పుకి బదులుగా పింక్ సాల్ట్ తీసుకుంటే మంచిదంటారు. ఉప్పులో ఇతర రకాలు ఉంటాయా? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారం వండడం, వండిన ఆహారాన్ని నిల్వ చేయడంలో ఉప్పు కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మంచి రుచిని, వంటకు కొత్తదనాన్ని ఇస్తుంది. అయితే మీరు రోజూవారి వంటలో ఎలాంటి ఉప్పు వంటకు ఏ రకమైన ఉప్పు వేస్తే మంచిదో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

కోషర్ ఉప్పు

కోషెర్ ఉప్పును తక్కువగా రిఫైండ్ చేస్తారు. కాబట్టి స్వచ్ఛమైన సోడియం క్లోరైడ్‌గా చెప్తారు. పైగా ఇది అయొనైజ్డ్ కాదు. కాబట్టి ఫుడ్‌ని సీజనింగ్ చేయడానికి ఇది మంచిదని చెప్తారు. అంటే ఆహారాన్ని స్టోర్ చేయడానికి ఇది మంచిది. అయితే దీనిని బేకింగ్‌కు ఉపయోగించకూడదట.

టేబుల్ సాల్ట్

రెగ్యులర్‌గా ఉపయోగించే ఉప్పుల్లో టేబుల్ సాల్ట్ ఒకటి. ఇదే కరెక్ట్ ఉప్పు అనుకుంటారు కానీ.. ఇది సహజమైన ఉప్పు కాదట. ఈ సాల్ట్‌ని ప్రాసెస్ చేస్తారట. దీనిలో ఖనిజాలు ఉండవు. అయితే దీనిలో అయోడిన్, యాంటీకేకింగ్ ఏజెంట్లు ఉంటాయి. దీనిని మైనింగ్ నిక్షేపాల నుంచి తీస్తారట. మసాలాలు, వంటలు, బేకింగ్‌కి ఇది మంచి ఆప్షన్.

సముద్రపు ఉప్పు

సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఈ ఉప్పును తయారు చేస్తారు. అయితే దీనిని టేబుల్ సాల్ట్ కంటే తక్కువగా ప్రాసెస్ చేస్తారు. దీనివల్ల ఈ ఉప్పులో ఖనిజాలు ఉంటాయి. ఇది ఆహారానికి మంచి రుచిని అందిస్తుంది. ఇతర ఉప్పుల కంటే మంచి వ్యత్యాసం ఉంటుంది.

పింక్ సాల్ట్

హిమాలయాలకు దగ్గరగా ప్రాంతాల నుంచి ఈ ఉప్పును సేకరిస్తారు. దీనిలో సోడియం, ఐరన్, జింక్ వంటి ఎలిమెంట్స్ ఉంటాయి. టేబుల్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్ మరింత ఉప్పగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఉప్పు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. సాస్‌లు తయారు చేసుకోవడంలో ఉపయోగించుకోవచ్చు. అలాగే అన్నిరకాల వంటలకు ఇది మంచిదని చెప్తారు.

రెడ్ సాల్ట్

రెడ్ సాల్ట్‌నే అలియా సాల్ట్ అంటారు. దీనిని హవాయి ద్వీపం నుంచి వచ్చిన అగ్ని పర్వత మట్టితో తయారు చేస్తారు. ఇది 80 కంటే ఎక్కువ ఖనిజాలతో నిండి ఉంటుంది. పైగా ఐరన్ ఆక్సైడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ తేలికపాటి లవణం సున్నితమైన రుచిని ఇస్తుంది. మాంసం, చేపలకు, మసాలా చేయడానికి.. వాటిని నిల్వ ఉంచడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. పైగా ఇది వంటలకు రంగునిస్తుంది. పైగా మంచి సువాసన కూడా ఇస్తుందట. ఫ్రై రెసిపీలకు ఇది బెస్ట్ ఆప్షన్.

బ్లాక్ సాల్ట్

నల్ల ఉప్పును హిమాలయాల నుంచి తయారు చేస్తారు. అక్కడ అగ్నిపర్వత శిల నుంచి ఒక రకమైన రాతి ఉప్పును తయారు చేస్తారు. ఈ ఉప్పులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఉంటుంది. ఇది ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. అందుకే దీనిని తక్కువ మోతాదులో ఉపయోగించాలి. కూరలు, మసాలా వంటలు, ఊరగాయలు, సలాడ్స్‌కి ఇది మంచి రుచిని ఇస్తుంది.

ఫ్లేవర్డ్ సాల్ట్

ఫ్లైవర్డ్ సాల్ట్‌లో ఉప్పు, మాసాలా పొడి, మూలికలతో నిండి ఉంటుంది. ఇవి డిష్ రుచిని పెంచడంలో, టేస్ట్‌ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. మీ డిష్‌కి రుచిని పెంచాలనుకున్నప్పుడు దీనిని ట్రై చేయవచ్చు. మాంసం, పౌల్ట్రీ, చేపలు, కూరగాయలను స్టోర్ చేయడానికి కూడా ఇది మంచిదని చెప్తారు.

ఫ్లూర్ డి సెల్, సెల్టిక్ సముద్ర ఉప్పు, ఫ్లైక్ సాల్ట్, బ్లాక్ లావా సాల్ట్, స్మోక్డ్ సాల్ట్ వంటివి రకాలు వాడుకలో ఉన్నాయి. వీటిని కూడా వంటల్లో ఉపయోగిస్తారు. మీకు నచ్చిన ఉప్పును.. మీకు ఇష్టమైన వంటలకు ఉపయోగించుకుని.. రుచిని ఆస్వాదించేయండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఉప్పును తక్కువ తీసుకోవడమే మంచిది. అది ఏది అయినా. కాబట్టి నిపుణుల సలహా తీసుకుని ఉప్పును తీసుకుంటే బెటర్.

Also Read : ఆరోగ్యంగా ఉంటూ ఆయుష్షు పెంచుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. వాటిని దూరంగా ఉంచండి