TVS Apache Honda Hornet 2.0 Price Drop: కొత్త GST 2.0 సంస్కరణల అమలుతో టూవీలర్‌ విభాగానికి బూస్ట్‌ దొరికింది. TVS Apache వంటి పాపులర్‌ మోటార్ సైకిళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి, మధ్య తరగతి యూజర్లు కూడా సులభంగా కొనుగోలు చేయగల స్థాయికి దిగి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో, Apache RTR 160 2V ప్రారంభ ధర కేవలం రూ. 1,01,890 (ఎక్స్-షోరూమ్) కు పడిపోయింది. దీని అర్థం, ఈ బండి బయ్యర్లు ఇప్పుడు దాదాపు రూ. 11,000 - రూ. 12,000 వరకు నేరుగా సేవ్‌ చేసుకోవచ్చు.

ప్రీమియం మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్లు
ఎంట్రీ-లెవల్ మోడల్స్ మాత్రమే కాకుండా, అపాచీ RTR 310 & RR 310 వంటి టాప్-ఎండ్ మోడల్స్ కూడా గణనీయమైన ప్రైస్‌ డ్రాప్‌లో భాగమయ్యాయి. QS (Quick Shifter) లేని RR 310 బేస్ వేరియంట్‌ (RR 310 Base W/O QS) ఇప్పుడు కేవలం రూ. 2,56,240 కి అందుబాటులో ఉంది, ఇది మునుపటి కంటే దాదాపు రూ. 21,759 తక్కువ. QS లేని RTR 310 బేస్ ‍‌(RTR 310 Base W/O QS) ధర రూ. 2,21,240 కి తగ్గింది, దీనివల్ల కస్టమర్లకు రూ. 18,750 వరకు ఆదా అవుతుంది. అందువల్ల, GST తగ్గింపు అన్ని విభాగాలలోని బైక్ ప్రేమికులకు ఆకర్షణీయమైన ప్రయోజనం చేకూర్చింది.

అపాచీ RTR 160 2V డిజైన్ & ఫీచర్లు
TVS Apache RTR 160 2V రూపం రేసింగ్ అనుభూతిని అందిస్తుంది. దాని బీస్ట్-ఇన్‌స్పైర్డ్‌ హెడ్‌ల్యాంప్, LED లైట్ గైడ్స్‌ & పైలట్ లాంప్స్‌ ఈ బండి రూపురేఖలను మరింత మెరుగుపరుస్తాయి. రేసింగ్ గ్రాఫిక్స్ & కార్బన్ ఫైబర్ డిజైన్ అంశాలు దీనికి ప్రీమియం స్పోర్ట్స్ అనుభూతిని ఇస్తాయి. డిజిటల్ కన్సోల్ తెల్లటి బ్యాక్‌లిట్ డిస్‌ప్లేతో ఉంటుంది, ఇది పగలు & రాత్రి రెండు సమయాల్లోనూ స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. గ్లోసీ బ్లాక్, పెర్ల్ వైట్, T గ్రే, రేసింగ్ రెడ్ & మాట్టే బ్లూ వంటి రంగు ఎంపికలలో TVS Apache RTR 160 2V లభిస్తుంది.

ఇంజిన్ & పనితీరు
అపాచీ RTR 160 2V 159.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది BS6 ఫేజ్ 2 అనుకూలం. స్పోర్ట్ మోడ్‌లో, ఈ ఇంజిన్ 8750 rpm వద్ద 15.82 bhp శక్తిని & 7000 rpm వద్ద 13.85 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అర్బన్ & రెయిన్ మోడ్‌లలో, ఇది 13.32 PS & 12.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్ & వెట్ మల్టీప్లేట్ స్లిప్పర్ క్లచ్‌తో అనుసంధానమై ఉంటుంది, ఇది మృదువైన గేర్ షిఫ్టింగ్‌ అందిస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం 107 kmph & లీటరుకు 47-61 km మైలేజీ ఇస్తుంది. పనితీరు & సామర్థ్యం రెండింటిలోనూ ఈ బండి బలంగా ఉంది.

ఫీచర్లు & రైడింగ్ సౌకర్యం
Apache RTR 160 2V లో కస్టమర్ల సౌలభ్యం కోసం TVS చాలా మోడ్రన్‌ ఫీచర్లను యాడ్‌ చేసింది. ఇది సింగిల్ & డ్యూయల్-ఛానల్ ABS తో లభిస్తుంది. ఈ బైక్‌లో స్పోర్ట్, అర్బన్ & రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి. SmartXonnect బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. డిజిటల్ కన్సోల్ స్పీడోమీటర్, ట్రిప్‌మీటర్, టాకోమీటర్ & లో-ఫ్యూయర్‌ ఇండికేటర్‌ వంటివి ఉన్నాయి. Apache RTR 160 2V కెర్బ్ బరువు 137 & 140 కిలోల మధ్య ఉంటుంది. 12-లీటర్ ఇంధన ట్యాంక్‌ ఈ బండి సొంతం. కంపెనీ డేటా ప్రకారం, ఫుల్ ట్యాంక్‌తో ఈ బైక్‌ 732 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

ప్రత్యర్థి బైక్‌లు కూడా చవక!
టీవీఎస్‌ అపాచీ RTR 160... Honda Hornet 2.0, Hero Xtreme 160R & Bajaj Pulsar వంటి బైకులతో పోటీ పడుతుంది. మీరు అపాచీ RTR 160 4V లాంటి మోడల్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, హోండా హార్నెట్ 2.0 & హీరో ఎక్స్‌ట్రీమ్ 160R ఉత్తమ ఎంపికలు కావచ్చు.

ముఖ్యంగా, హోండా హార్నెట్ 2.0 ధర GST తగ్గింపు తర్వాత దాదాపు రూ. 13,026 తగ్గింది. దీని ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 1.58 లక్షలు. ఇందులో 184.4cc OBD2B-కంప్లైంట్ ఇంజిన్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్కులు, పూర్తి LED లైటింగ్ & డిజిటల్ LCD మీటర్ ఉన్నాయి.