Creamy and Spicy Turkish Chicken Recipe : చికెన్‌తో ఎప్పుడూ ఒకే రకమైన కర్రీలు, ఫ్రైలు చేసుకుని బోర్ కొడుతుందా? అయితే కాస్త కొత్తగా ఈ టర్కిష్ చికెన్‌ను ట్రై చేయండి. పెరుగు, మసాలాలతో మ్యారినేట్ చేసిన చికెన్‌ను క్రీమీ సాస్‌తో కలిపి తయారు చేసే ఈ రెసిపీ రుచిగా ఉండటంతో పాటు ప్రోటీన్ కూడా అందిస్తుంది. అయితే దీనిని తినేందుకు రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

టర్కిష్ చికెన్‌కు కావాల్సిన పదార్థాలు

బోన్‌లెస్, స్కిన్‌లెస్ చికెన్ - అరకేజి

పెరుగు - 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు - 1 టీస్పూన్

కారం - 1 టీస్పూన్

మిరియాల పొడి - 1 టీస్పూన్

జీలకర్ర పొడి - 1/3 టీస్పూన్

పాప్రికా - 1/2 టేబుల్ స్పూన్

టమాటా పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు

Also Read : బయట క్రిస్పీగా.. లోపల జ్యూసీగా ఉండే హైదరాబాద్ చికెన్ 65.. రెసిపీ ఇదే

అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూన్

బటర్ - 2 టేబుల్ స్పూన్లు

మైదా - 1 టేబుల్ స్పూన్

స్కిమ్డ్ మిల్క్ - 150 మిల్లీలీటర్లు

గార్లిక్ పౌడర్ - చిటికెడు

చిల్లీ ఫ్లేక్స్ - చిటికెడు

ఒరేగానో - చిటికెడు

చీజ్ - 20 గ్రాములు

కొత్తిమీర - కొద్దిగా

చికెన్‌ మ్యారినేషన్..

ముందుగా ఒక బౌల్‌లో అరకేజి బోన్‌లెస్, స్కిన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. అందులో పెరుగు, ఉప్పు, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పాప్రికా, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ చికెన్‌కు బాగా పట్టేలా కలపాలి. దీనిని అరగంట నుంచి గంట వరకు పక్కన పెట్టుకోవాలి.

Also Read : గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ.. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది

టర్కిష్ చికెన్‌ తయారీ విధానం

ముందుగా స్టవ్‌ వెలిగించి దానిపై పాన్ పెట్టి మీడియం ఫ్లేమ్‌ పెట్టాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. బటర్ కరిగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్‌ను పాన్‌లో వేసి సమానంగా పరచాలి. చికెన్ అన్ని వైపులా బాగా ఉడికేలా మధ్య మధ్యలో తిప్పుతూ 15 నిమిషాలు ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత క్రీమి సాస్ చేసుకోవాలి.

క్రీమీ సాస్ కోసం..

ఇప్పుడు మరో పాన్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగించాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి కలపాలి. తర్వాత 150 మిల్లీలీటర్ల స్కిమ్డ్ మిల్క్‌ను కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. ఉండలు లేకుండా స్మూత్‌గా కలిసే వరకు ఉడికించాలి. దానిలో గార్లిక్ పౌడర్, కొద్దిగా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, నల్ల మిరియాల పొడి, ఒరేగానో వేసి బాగా కలపాలి. సాస్ కాస్త చిక్కగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

Also Read : 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే

పూర్తిగా ఉడికిన చికిన్పై.. తయారు చేసుకున్న క్రీమీ సాస్‌ను పోయాలి. తర్వాత చీజ్ వేసి పాన్‌కు మూత పెట్టాలి. ఫ్లేమ్‌ను తగ్గించి ఉంచి సుమారు 2 నిమిషాలు ఉడికించాలి. చీజ్ కరిగిన తర్వాత పైన కొత్తిమీర చల్లితే టేస్టీ టేస్టీ టర్కిష్ చికెన్ రెడీ. ఈ చికెన్‌ను రోటీ, నాన్, బ్రెడ్ లేదా రైస్‌తో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ టేస్టీ చికెన్ రెసిపీని ట్రై చేసేయండి.

Also Read : సండే స్పెషల్ స్పైసీ, టేస్టీ చికెన్ రోస్ట్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, బ్యాచిలర్స్ కూడా ఈజాగా ట్రై చేసుకోవచ్చు