TS NEET UG 2025 Seat Allotment: తెలంగాణలో రెండో దశ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్. ఇప్పటికే తమకు కావాల్సిన కాలేజీలో సీట్లను ఎంపిక చేసుకున్న విద్యార్థులు వాటి ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తగ్గట్టుగానే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆ రెండో దశ సీట్ల కేటాయింపు వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టింది.

రెండో దశలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సిన పని లేదు. నేరుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెకండ్‌ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీడీఎఫ్‌ ఉన్న వివరాల్లో మీ పేరు మీకు కేటాయించిన కాలేజీ వివరాలను చెక్ చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్ చేసిన సెకండ్ ఫేజీ ఎంబీబీఎస్‌, బీడీఎస్ జాబితా పీడీఎఫ్‌లో ర్యాంకులు, రోల్‌ నెంబర్ వారిగా కేటాయించిన కాలేజీల వివరాలు ఇచ్చారు. అందులో మీరు మీ మెరిట్ ఆధారంగా సాధించిన కాలేజీ గురించి చూడొచ్చు. ఇందులో ర్యాంకు, కేటగిరి, రిజర్వేషన్లు ఇతర ప్రాధాన్యతల ఆధారంగా కేటాయింపులు జరిగాయి. వాటిని చెక్ చేయవచ్చు. మీ పేరుకు ఎదురుగా అన్ని వివరాలు పొందుపరిచారు.

మీరు డౌన్‌లౌడ్ చేసిన రెండో దశ ఎంబీబీఎస్, బీడీఎస్, పీడీఎఫ్‌ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి. ఇందులో మీకు కేటాయించిన కాలేజీ నచ్చినట్టు అయితే తర్వాత ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ కాలేజీకి వెళ్లి ఫీజు చెల్లించి మిగతా వివరాలు అందజేయాలి. అప్పుడే మీకు కేటాయించిన సీటు మీకు కన్ఫామ్ అవుతుంది. లేకుంటే గడువు లోపు ఈ పని పూర్తి చేయకుంటే మాత్రం సీట్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది.

మీరు నీట్ అప్లికేషన్ నింపేటప్పుడు ఇచ్చిన మెయిల్, ఫోన్ నెంబర్‌కి కూడా వివరాలు పంపించారు. ఒక్కసారి చెక్ చేసుకోండి. కొన్ని సార్లు మెయిల్‌లో వివరాలు స్పాన్‌లోకి వెళ్లి ఉంటాయి. అందులో కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు కేటాయించిన కాలేజీ పేరుతో మీకు అలాట్మెంట్ లెటర్ వచ్చి ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేయాలి అంటే కచ్చితంగా అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. అప్పుడే దాన్నిడౌన్ లోడ్ చేసుకోగలరు. కాలేజీకి వెళ్లినప్పుడు కచ్చితంగా ఇది ఇస్తేనే మీరు తర్వాత ప్రక్రియ పూర్తి చేయడానికి వీలవుతుంది.

ఒకసారి డౌన్‌లౌడ్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ అభ్యర్థులు నలభై వేలు, బీడీఎస్ అభ్యర్థులు ఇరవై వేలు చెల్లించాలి. అలా చెల్లించిన తర్వాత మీ సీటును హోల్డ్ చేస్తారు. ఒక తేదీని మీకు ఇస్తారు. ఆ తేదీ లోపు మీరు కాలేజీకి వెళ్లి మిగతా ప్రక్రియ పూర్తి చేయాలి. ఆన్‌లైన్‌లో వివరాలు అందివ్వకుండా కూడా కాలేజీకి వెళ్లినా ప్రయోజనం ఉండదు.

ఈ రెండింటిలో ఏది చేయకున్నా సరే మీ సీటును రద్దు చేస్తారు. తర్వాత విడత కౌన్సెలింగ్స్‌లో ఆ సీటును ఉంచుతారు. అందుకే కచ్చితంగా ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలి. నచ్చిన సీటు రాని వాళ్లు తర్వాత విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.