Trinadha Rao Nakkina Comments On Anshu Ambani: దర్శకుడు త్రినాథరావు నక్కిన మరోసారి నోరు జారారు. ఆయన నిర్మాణంలో 'చౌర్య పాఠం' అని ఓ సినిమా తెరకెక్కింది. ఆ టీజర్ విడుదల కార్యక్రమంలో హీరోయిన్ తనకు హగ్ ఇవ్వలేదంటూ స్టేజి మీద కక్కుర్తి పడ్డారు నక్కిన. ఇప్పుడు సందీప్ కిషన్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'మజాకా' టీజర్ విడుదల అయింది. ఆ కార్యక్రమంలో 'మన్మథుడు' హీరోయిన్ అన్షు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ ఇద్దరి మీద ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేశారు.

రేవంత్ రెడ్డి పేరు బన్నీ మర్చిపోయినట్లు...
హీరోయిన్ పేరు వాటర్ అంటూ నక్కిన నాటకం
'పుష్ప 2 ది రూల్' సినిమా పేరు ఎంతగా వైరల్ అయిందో... అంత కంటే ఎక్కువగా సినిమా విడుదల తర్వాత నిర్వహించిన ఒక కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మరిచిపోవడం, సీఎం పేరు చెప్పకుండా మంచి నీళ్లు అడిగిన తీరు వైరల్ అయింది.‌ 'మజాకా' టీజర్ విడుదల కార్యక్రమంలో ఆ సీన్ రీ క్రియేట్ చేశారు త్రినాథరావు నక్కిన.

'మజాకా' సినిమాలో అన్షుతో పాటు రీతు వర్మ హీరోయిన్. ఆవిడ గురించి చెప్పే సమయంలో 'మా సినిమాలో సెకండ్ హీరోయిన్... తన పేరు... అరే వాటర్ తీసుకు రండి' అంటూ ఓవరాక్షన్ చేశారు త్రినాథరావు నక్కిన. రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన కారణంగా బన్నీని అరెస్టు చేశారు అంటూ ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ నేత కేటీఆర్ వంటి నాయకులు సమయం, సందర్భం దొరికిన ప్రతిసారి విమర్శిస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి మీద త్రినాథరావు నక్కిన సెటైర్ వేశారా? లేదంటే ముఖ్యమంత్రి పేరును మర్చిపోయి వాటర్ అంటూ కవరింగ్ చేయడానికి ప్రయత్నించిన అల్లు అర్జున్ మీద సెటైర్ వేశారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Also Read: 'డాకు మహారాజ్'లో 'అది చెప్పరా గాడిద...' డైలాగ్ - బాలకృష్ణ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో లైవ్ అప్డేట్స్ - సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి

అన్షు శరీరాకృతి మీద నక్కిన అనుచిత వ్యాఖ్యలు
కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన 'మన్మథుడు' సినిమాలో అన్షు హీరోయిన్. ఆవిడ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో వస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్ 'రాఘవేంద్ర' సినిమాలో కూడా నటించారు. ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు 'మజాకా'తో టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ఆవిడ గురించి దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ... అన్షు సన్నగా ఉన్నారని, తెలుగు ప్రేక్షకులకు ఇలా ఉంటే కుదరదని, కాస్త లావు అవ్వాలని తాను చెప్పానన్నట్లు వివరించారు. అయితే త్రినాథరావు నక్కిన ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకరంగా ఉంది. దర్శకుడిగా ఆయన స్థాయి దిగజారి మాట్లాడారని సోషల్ మీడియా అంతా విమర్శలతో మార్మోగుతుంది. ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులు సైతం నక్కిన ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని చెబుతున్నారు. ఇక, 'మన్మథుడు' సినిమాలో అన్షును చూసి లడ్డూలా ఉందని ఫీలైనట్టు చెప్పుకొచ్చారు.

Also Read: తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా'తో పాటు సౌత్‌లో ఫస్ట్‌ టాకీల వరకు - రెంటాల జయదేవ రాసిన 'మన సినిమా - ఫస్ట్ రీల్' బుక్ రివ్యూ