Shraddha Das's Horror Thriller Trikala OTT Streaming : మరో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలో సూపర్ థ్రిల్ పంచేందుకు రెడీ అయిపోయింది. దేవి ఫేం చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్, హీరోయిన్ శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ 'త్రికాల : స్క్రిప్ట్ ఆఫ్ గాడ్'. మే 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'త్రికాల' మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' (SunNXT)లో గురువారం నుంచి తెలుగుతో పాటు తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీకి మణి తెల్లగూటి దర్శకత్వం వహించగా... మాస్టర్ మహేంద్రన్, శ్రద్ధాదాస్, ఆమని, అజయ్, సాహితి అవంచ, ప్రభాకర్, రవి వర్మ, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించగా... చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధిక శ్రీనివాస్ నిర్మించారు.

Also Read : Toxic Songs : టాక్సిక్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది - యశ్, కియారాల రొమాన్స్ చూశారా?... బ్యూటిఫుల్ లిరిక్స్