Yash's Reaction Over Toxic Movie Trollings : కన్నడ స్టార్ యశ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. రాయగా యశ్ ఫస్ట్ లుక్ ఇంట్రడ్యూస్ చేసిన నుంచి స్పెషల్ వీడియోస్, సాంగ్స్‌లో రొమాంటిక్ సీన్స్ కొంచెం ఎక్కువగానే కనిపించాయి. దీంతో మొదటి నుంచి ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ట్రోలింగ్స్ సాగాయి. రీసెంట్ ట్రైలర్‌లోనూ యాక్షన్, వయలెన్స్ ఎక్కువగానే ఉంది. దీనిపై హీరో యశ్ రియాక్ట్ అయ్యారు.

'అది వారి లోపం'

టాక్సిక్ అనేది కేవలం యశ్ సినిమా మాత్రమే కాదని... ఇది ఇండియన్ సినిమా అని అన్నారు యశ్. 'మా ప్రయత్నాన్ని ఆడియన్స్ అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఆ తర్వాత అందరి ఆలోచనల్లో మార్పు వస్తుంది. మేము ఎంత ముందుచూపుతో ఈ మూవీ చేశామో మీకే అర్థమవుతుంది. నటీనటులంతా ఎన్నో త్యాగాలు చేసి ఈ మూవీ ఒకే వేదికపై నిలబెట్టాలనే ఒకే ఒక లక్ష్యంతో వర్క్ చేశారు.

చాలా మంది ఈ మూవీ గురించి నెగిటివ్‌గా మాట్లాడారు. కానీ, నేను ఎవరి మాటలు వినను. అలా విమర్శించే వారి ఊహాశక్తి లోపం ఉందని అనుకుంటాను. కష్టపడితే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదు.' అని అన్నారు.

Also Read : Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?