Today Top Headlines In AP And Telangana:

1. టీడీపీ, జనసేనకు బుల్లిరాజు ప్రచారం

రేవంత్ భీమల (Revanth Pavan Sai Subhash Bhimala)... తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ బుడ్డోడు చేస్తున్న సందడి మామూలుగా లేదు. విక్టరీ వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన హ్యాట్రిక్ హిట్ 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల తర్వాత‌ రేవంత్ పాపులర్ అయ్యాడు. ఆడియన్స్ అందరూ అతని నటన గురించి గొప్పగా చెబుతున్నారు. ఏపీ ఎన్నికల్లో ఈ రేవంత్ ప్రచారం చేశాడని తెలుసా?. ఇంకా చదవండి.

2. అనంతపురంలో సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి

ఓ పోలీస్ అధికారి, సామాన్య వ్యక్తి మధ్య ఫోన్ కాల్ సంభాషణ పెను దుమారం రేపింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇవ్వాలని సదరు వ్యక్తి పోలీస్‌ను అడగ్గా వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. ఈ ఆడియో సంభాషణ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం (Anantapuram) జిల్లా తాడిపత్రి (Tadipatri) పట్టణ సీఐ సాయిప్రసాద్‌కు అదే పట్టణానికి చెందిన రాంపుల్లయ్య అనే వ్యక్తి ఫోన్ చేశాడు. జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) ఫోన్ నెంబర్ కావాలని అడిగాడు. ఇంకా చదవండి.

3. ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్

ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Car Race) వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) గురువారం ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. అటు, ఈడీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. ఇంకా చదవండి.

4. ఆ ప్రచారంలో నిజం ఎంత..?

తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాల్లో మార్పు కనిపించింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిని బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు. అదే సమయంలో ఇంకా చాలా మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గతంలో కేసీఆర్ చేసినట్లుగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ ఫిరాయింపుల నెంబర్ పది మందితోనే ఆగిపోయింది. ఇప్పుడు చేరిన ఆ పదిమందిలోనూ కొంత మంది వెనక్కి వెళ్తుననారన్న ప్రచారం ఊపందుకుంది. ఇంకా చదవండి.

5. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. ఇటీవల ప్రయోగించిన స్పేడెక్స్ (SpadeX) మిషన్‌లో భాగంగా అంతరిక్షంలో ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ తాజాగా విజయవంతమైంది. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించినట్లు తెలిపింది. ఇప్పటికే మూడుసార్లు డాకింగ్ ప్రక్రియ వాయిదా పడగా తాజాగా సక్సెస్ అయ్యింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇంకా చదవండి.