Today Top Headlines In AP And Telangana:

1. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

ప్రతి ఏడాదిలాగే ఈ సంక్రాంతికి నగరం నుంచి సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. పండుగకు సొంతూరికి వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. సిబ్బంది హైదరాబాద్‌ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తుండగా.. మరోవైపు ఏపీ వైపు వెళ్తున్న వారిని 10 టోల్‌బూత్‌ల ద్వారా పంపిస్తున్నారు. ఇంకా చదవండి.

2. ఏపీలో అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న అని లోకేష్ కొనియాడారు. ఇంకా చదవండి.

3. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా ఇవ్వకుండా జెసీబీతో కొలుస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో యాడికి అభివృద్ధి చెందాల్సిన ప్రాంతమని అన్నారు. కానీ మండల కేంద్రంలోని కుంటలో దేవస్థానానికి చెందిన స్థలాలలో అక్రమ కట్టడాలు కడుతున్నారని, కట్టవద్దని సూచించారు. నిర్మాణాల్లో తమ వాళ్ళు ఉన్న వదిలేది లేదన్నారు. యాడికి అభివృద్ధి తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇంకా చదవండి.

4. తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన

తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా బస్సు టికెట్ ధరలు భారీగా పెంచారని ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల నుంచి టిెకెట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రాష్ట్ర ఆర్టీసీని ఏకిపారేస్తున్నారు. సజ్జనార్ సార్ ఈ టికెట్ ధరల పెంపు ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీజీ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక బస్సుల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తోంది. ఇంకా చదవండి.

5. సంక్రాంతికి ఊరెళ్తే ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి

సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకుపోతుంటారు. కొందరైతే వీలును బట్టి మూడు, నాలుగు రోజుల ముందే సొంతూరికి వెళ్లిపోతుంటారు. అయితే అందరికీ అలా కాదు. సాఫ్ట్ వేర్ రిలెటెడ్ ఉద్యోగులు శుక్రవారం డ్యూటీ ముగిసినప్పటి నుంచి తమ జర్నీ మొదలుపెడతారు. శనివారం లీవ్ దొరికే వారు సైతం నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ నుంచి సొంతూరికి పయణమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌- విజయవాడ నేషనల్ హైవేపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా చదవండి.