<p>AP CM Chandra Babu Emergency Meeting Over Tirumala Stampede Issue: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం వచ్చిన భక్తులు ఆరుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్నారు సిఎం <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a>. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన దుర్ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. </p>