Tirumala News: తిరుమలలో మరో అపచారం.. ఇద్దరు ఉద్యోగులపై వేటు వేసిన టీటీడీ

3 weeks ago 2
ARTICLE AD

TTD Workers Eating Non Veg at Alipiri | తిరుమలలో మరోసారి మహాపచారం జరిగింది.  పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత మెట్ల మార్గంలో కొందరు మాంసాహారం తిన్నారు. అయితే టీటీడీ సిబ్బంది అయి ఉండి తిరుమలలో ఎలా నడుచుకోవాలో రూల్స్, పద్ధతి, సంప్రదాయం తెలియవా అని హిందువులు మండిపడుతున్నారు.

సిబ్బందిపై టీటీడీ చర్యలు..
టీటీడీ ఔట్సోర్సింగ్ లో పనిచేసే ఉద్యోగులు రామస్వామి, సరసమ్మ నిన్న అలిపిరి వద్ద  మాంసాహారం తిన్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. పవిత్రమైన శ్రీవారి సన్నిధిలో అపచారం చేసిన రామస్వామి, సరసమ్మ అనే ఇద్దరు ఔట్సోర్సింగ్  ఉద్యోగులపై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మెట్ల మార్గంలో మాంసాహారం తిన్న ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీటీడీ విధుల నుంచి తొలగించింది. తిరుమల క్షేత్రంలో తప్పిదాలు, సంప్రదాయ ఉల్లంఘనను ఉపేక్షించేది లేదని బోర్డు స్పష్టం చేసింది. ఎవరైనా తిరుమలపై దుష్ప్రచారం చేసినా, స్వామి వారి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం తీసినా చర్యలు తప్పవని టీటీడీ ఛైర్మన్ పలుమార్లు స్పష్టం చేశారు.

🚨 #BRNaiduUnfitForTTD

తిరుమలలో మరోసారి మహాపచారం

పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత.. మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది

ఏంటి ఈ అపచార పనులు అని ప్రశ్నించిన శ్రీవారి భక్తులని బెదిరించిన టీటీడీ సిబ్బంది

టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా? ఇదేనా… pic.twitter.com/JdbQ0PFUY4
— YSR Congress Party (@YSRCParty) November 10, 2025

వైసీపీ నేతలు ఆగ్రహం
ఇదే కనుక వైసీపీ హయాంలో జరిగి ఉంటే వైస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని ఏకిపారేసేవారు. కానీ ఇది చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో జరిగింది కనుక సైలెంట్ గా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా? దేవాలయాల్ని ప్రక్షాళన చేయడమంటే ఇదేనా చంద్రబాబూ? అని ప్రశ్నిస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవన్ కళ్యాణ్ హెలికాప్టర్, విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు తప్పా.. ఇలాంటివి ఆయన కంటికి మాత్రం కనడపడవా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Read Entire Article