RTC Bus Accident In Tirumala Second Ghat Road: తిరుమలలో (Tiruamala) పెను ప్రమాదం తప్పింది. భక్తులతో వెళ్తున్న బస్సు రెండో ఘాట్ రోడ్డులో డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండడంతో రోడ్డుపైనే బస్సు నిలిచిపోయింది. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో అలిపిరి వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, సిబ్బంది అక్కడికి చేరుకుని బస్సును క్రేన్ సహాయంతో తొలగించేందుకు యత్నిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు.

Also Read: Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా