<p>Telangana News | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్పెషల్ టైగర్ కారిడార్ ఏర్పాటునూ ప్రభుత్వం విరమించుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.</p>
<p>సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ... PCCF ఇటీవల జిల్లాను సందర్శించినప్పుడు ఆసిఫాబాద్ మరియు సిర్పూర్ నియోజకవర్గాల్లో టైగర్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలియజేయడం అన్యాయమన్నారు. ప్రజలను గాని, ప్రజాప్రతినిధులను గాని సంప్రదించకుండా ఇలా ప్రతిపాదనలు చేసి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తామన్నారు. తగు ప్రాణాలికలు లేకుండా ఊర్లను తరలిస్తామని చెప్తున్నారని, ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందని తెలియజేశారు.</p>
<p>వెంటనే టైగర్ కారిడార్ ప్రతిపాదనను విరమించుకొని, పెద్దపులి వలన ఉత్పన్నం అవుతున్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు డా.కొత్తపల్లి శ్రీనివాస్, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, మాజీ జడ్పీటిసి అరిగేలా నాగేశ్వర్ రావు, మాజీ ఎంపిపి అరిగేలా మల్లికార్జున్, కొట్రంగి విజయ్, సతీష్, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, కృష్ణ కుమారి మల్లిక్, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీదేవి, అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, సుదర్శన్ గౌడ్, ఖాండ్రే విశాల్ మరియు అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.</p>