Harsh Roshan's Thella Kaagitham OTT Platform Locked : 'బ్యాండ్ మేళం' తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో హర్ష్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తెల్లకాగితం. రిలీజ్‌కు ముందే ఆన్ లైన్‌లో మూవీ సీన్ లీక్ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది. సినిమాపై యూత్‌లో మంచి హైప్ ఉండగా... లీకైన వీడియోతో అది పదింతలైంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'తెల్లకాగితం' డిజిటల్ రైట్స్ ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్' సొంతం చేసుకోగా... థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత అంటే అక్టోబర్ లాస్ట్ వీక్‌లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్‌లో కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా... హర్ష్ రోషన్ సరసన నక్షత్ర హీరోయిన్‌గా నటించారు.

వీరితో పాటే అజయ్, శరణ్య, దీపక్, గోపరాజు రమణ, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ మూవీని నిర్మించారు.

Also Read : Dont Trouble The Trouble OTT : ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

స్టోరీ ఏంటంటే?

రాము (హర్ష్ రోషన్), ఆశా (నక్షత్ర) క్లాస్ మేట్స్. తమ పేరెంట్స్ కలలకు అనుగుణంగా మంచిగా చదువుకుని పేరు తెచ్చుకోవాలని కలలు కంటారు. తెలిసీ తెలియని వయసులో రాము ఆశాతో ప్రేమలో పడతాడు. రాము ప్రేమను మొదట్లో ఆశా నిరాకరించినా... ఆ తర్వాత అతని మంచి మనసు చూసి యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత అనుకోని వయసులో వారిద్దరూ తొందరపడతారు. దీని వల్ల ఆశా ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయాన్ని తమ పేరెంట్స్‌కు తెలియకుండా దాచేందుకు యత్నిస్తారు. ఈ క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. చివరకు ఏం జరిగింది? వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందా? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Crime Thriller Series OTT : ఫ్యూచర్ ముందే తెలిస్తే నిజంగా 'వరం' - మెగా డాటర్ నిర్మాతగా సూపర్ నేచరల్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.