Paresh Rawal's The Taj Story Movie OTT Release Date Locked : బాలీవుడ్ యాక్టర్ పరేశ్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ కోర్టు రూం డ్రామా 'ది తాజ్ స్టోరీ'. గతేడాది అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పలు వివాదాలకు దారి తీసింది. తాజ్ మహల్ నుంచి శివుని విగ్రహం బయటకు వస్తున్న దృశ్యంతో రిలీజైన పోస్టర్ కాంట్రవర్సీగా నిలిచింది. దాదాపు 4 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'ది తాజ్ స్టోరీ' మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'లయన్స్ గేట్ ప్లే' సొంతం చేసుకోగా ఈ నెల 13 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి తుషార్ అమ్రిష్ గోయల్ దర్శకత్వం వహించగా... పరేష్ రావల్‌తో పాటు జాకీర్ హుస్సేన్, అమృత ఖాన్విల్కర్, నమిత్ దాస్, స్నేహ వాఘ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సురేశ్ ఝూ ఈ మూవీని నిర్మించారు.

Also Read : బన్నీ, అట్లీ మూవీలో సాంగ్స్ ఎన్నో తెలుసా? - యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆన్ వర్క్స్