Prabhas's The Raja Saab Movie Run Time Locked : మరో 5 రోజుల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా... మూవీ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది.

3 గంటల్లోపే ప్రభాస్ మూవీ

'ది రాజా సాబ్' రన్ టైం 2 గంటల 55 నిమిషాలు అని తెలుస్తోంది. అయితే, దీనిపై మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది. సెన్సార్ రిపోర్ట్ తర్వాత ఫుల్ డీటెయిల్స్ వెల్లడి కానున్నట్లు సమాచారం. మూవీ రన్ టైం దగ్గరగా 3 గంటలు ఉందనే టాక్‌తో డైెరెక్టర్ మారుతి మ్యాజిక్ చేస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సంక్రాంతి మూవీ 3 గంటలంటే పెద్ద 'సాహసమనే చెప్పాలి' అంటూ తమ అభిప్రాయం చెబుతున్నారు.

Also Read : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?