ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన హారర్ ఎంటర్‌టైనర్ 'ది రాజా సాబ్' (The Raja Saab). అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమిది. థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. జనవరి 9న 'ది రాజా సాబ్' థియేటర్లలో సందడి చేయడానికి వస్తోంది. భారతీయ బాక్సాఫీస్ దగ్గర దీని కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ టాప్ ఓపెనింగ్ సినిమాలలో స్థానం సంపాదించుకుంటుందా? 'ది రాజా సాబ్' విడుదలైన మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందో తెలుసా?

'ది రాజా సాబ్' ఓపెనింగ్ ఎలా ఉంటుంది?
ఫాంటసీ హారర్ కామెడీగా 'ది రాజా సాబ్' రూపొందింది. బాహుబలి ప్రభాస్‌ను సీరియస్ పాత్రల తర్వాత కామెడీ పాత్రలో తిరిగి చూడటానికి సినిమా ప్రియులు చాలా ఉత్సాహం ఉండేది. ప్రారంభంలో సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ రిలీజ్ ఆలస్యం కావడంతో ఆశించినంత బజ్ క్రియేట్ కాలేదు.

Also Read: Tamannaah Bhatia: గోవా క్లబ్‌లో తమన్నా డ్యాన్స్... నిమిషానికి కోటి - టోటల్ 6 కోట్లు తీసుకుందట

ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే 'ది రాజా సాబ్'పై బజ్ కొంచెం తక్కువగా ఉంది. అందవల్ల, సినిమా ఓపెనింగ్ బాగుంటుంది కానీ సూపర్ స్టార్ లాస్ట్‌ ఫిలిమ్స్ సెట్ చేసిన బెంచ్‌ మార్క్‌ను ఇది అధిగమించదని ట్రేడ్ వర్గాల టాక్. 'రాధే శ్యామ్' ఓపెనింగ్ డే నెట్ కలెక్షన్‌ 43.1 కోట్లను 'ది రాజా సాబ్' అధిగమిస్తుంది. కానీ 'బాహుబలి 2'తో సహా రీసెంట్ ప్రభాస్ సినిమాల కంటే ఓపెనింగ్ తక్కువగానే ఉంటుందని టాక్.

Also Read: Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ విడుదల వాయిదా... ఎందుకు? బాలయ్య సినిమా డిజిటల్ తెరపైకి వచ్చేది ఎప్పుడు?

'ది రాజా సాబ్' ఎన్ని కోట్ల ఓపెనింగ్ సాధించగలదు?
దళపతి విజయ్ లాస్ట్ సినిమా 'జన నాయగన్'తో 'ది రాజా సాబ్' పోటీ పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో 'ది రాజా సాబ్' భారతీయ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 60-65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్‌ రాబట్టే అవకాశం ఉందని టాక్. ప్రభాస్ టాప్ 5 ఓపెనింగ్ సినిమాలలో స్థానం సంపాదించడానికి ఆ అమౌంట్ సరిపోదు. ప్రభాస్ ఇండియన్ మార్కెట్ చూస్తే... ఓపెనింగ్ సినిమాలలో ఐదవ స్థానంలో 'ఆదిపురుష్' ఉంది. అది 86.75 కోట్ల రూపాయల అద్భుతమైన ఓపెనింగ్ కలెక్షన్‌ను సాధించింది. దాన్ని 'ది రాజా సాబ్' బీట్ చేస్తుందో లేదో చూడాలి.

భారతీయ బాక్సాఫీస్ (నెట్) వద్ద ప్రభాస్ టాప్ 5 ఓపెనర్స్

బాహుబలి 2 - రూ. 121 కోట్లు

కల్కి 2898 AD - రూ. 95.3 కోట్లు

సలార్ - రూ. 90.7 కోట్లు

సాహో - రూ. 89 కోట్లు

ఆదిపురుష్ - రూ. 86.75 కోట్లు

Also Read: Thalapathy Vijay Remake Movies List: 'భగవంత్ కేసరి'కి ముందు దళపతి విజయ్ రీమేక్ చేసిన తెలుగు సినిమాల లిస్ట్ ఇదుగో