Nani's The Paradise Release Date : నేచరల్ స్టార్ నాని, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా ది ప్యారడైజ్ (The Paradise). గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి విపరీతంగా చర్చ సాగుతోంది. రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడబోతోందంటూ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా... దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

'వదంతులు నమ్మొద్దు'

అయితే, 'ది ప్యారడైజ్' థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి ఎవరూ ఎలాంటి వదంతులు నమ్మొద్దని... ఏదైనా ఉంటే అఫీషియల్‌గా తామే రివీల్ చేస్తామంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మూవీకి సంబంధించి అన్నీ అప్డేట్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థే అఫీషియల్‌గా షేర్ చేస్తుందని స్పష్టం చేశారు. మూవీ పోస్ట్ పోన్ అవుతుందనే ప్రచారంపై మాత్రం వారు స్పందించలేదు.

ఈ సినిమా తొలుత మార్చిలో వస్తుందని గతేడాది అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆగస్ట్ 21కి మార్చారు. కానీ, షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రమోషన్స్‌కు తగిన టైం లేకపోవడం వల్ల సినిమా రిలీజ్‌ను అనుకున్న తేదీకే 'ది ప్యారడైజ్' రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

Also Read : Romantic Drama Series OTT : ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?