The Girlfriend Collections: ఐదు రోజుల్లో 20 కోట్లు... రష్మిక గర్ల్ ఫ్రెండ్ జోరు తగ్గలేదు!
3 weeks ago 2
ARTICLE AD
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) లేటెస్ట్ సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'కు మహిళా ప్రేక్షకులు, ముఖ్యంగా ఈ తరం అమ్మాయిలు బ్రహ్మరథం పడుతున్నారు. అబ్బాయిలలో కొందరు సైతం సినిమా బావుందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రశంసలు మాత్రమే కాదు... సినిమాకు మంచి వసూళ్లు సైతం వస్తున్నాయి.
ఐదు రోజుల్లో 20 కోట్ల రూపాయలు వచ్చాయ్!
Rashmika's Girlfriend Movie Five Days Collection: థియేటర్లలోకి నవంబర్ 7వ తేదీన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా వచ్చింది. దానికి ముందు రోజు పెయిడ్ ప్రీమియర్ షోస్ పడ్డాయి. ప్రతి షోకి రెస్పాన్స్ బావుంది.
ఇండియాలో మొదటి రోజు 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ నెట్ కలెక్షన్స్ కోటిన్నర లోపే. కానీ రెండో రోజుకు ఆ అమౌంట్ రెండున్నర కోట్లకు పెరిగింది. మూడో రోజుకు మరింత పెరిగింది. ఇప్పుడు ఐదు రోజుల్లో ఈ సినిమా రూ 20 కోట్లు కలెక్ట్ చేసింది. రోజు రోజుకూ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి సినిమా కలెక్షన్స్ రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుందని ఒక అంచనా.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంతో పాటు ఆయన చూపించిన కథకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. అమ్మాయిల నుంచి అదిరే రెస్పాన్స్ వస్తోంది. రష్మిక నటనకు సైతం ప్రశంసలు దక్కుతున్నాయి.
Also Read: 'సంతాన ప్రాప్తిరస్తు'తో కొత్త అవతారంలో విక్రాంత్... 'స్పార్క్' ఫెయిల్యూర్ తర్వాత ఏం నేర్చుకున్నారంటే?
బాయ్ ఫ్రెండ్ రోల్ చేసిన దీక్షిత్ శెట్టిని కొంత మంది అమ్మాయిలు ద్వేషిస్తున్నారు. ఆయన నటన అంత ఇంపాక్ట్ చూపించిందని చెప్పవచ్చు. అనూ ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ నటించిన ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వాహేబ్ పాటలు అందించారు. ప్రశాంత్ ఆర్ విహారి నేపథ్య సంగీతం అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించారు.
Read Entire Article