Manoj Bajpayee's The Family Man 3 Series Trailer Out : బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్ అవెయిటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 నుంచి ట్రైలర్ వచ్చేసింది. రాజ్ & డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అంతకు మించి థ్రిల్ పంచేందుకు మూడో సీజన్ కూడా రెడీ అయిపోయింది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైవలెన్స్ సెల్ (TASK) సీనియర్ ఆఫీసర్‌ శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ అదరగొట్టారు. ఫస్ట్ ఓ కామెడీ కాన్వర్షేషన్‌తోనే ట్రైలర్ ప్రారంభం కాగా... ఆ తర్వాత యాక్షన్ సీక్వెన్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. 'నేను ఓ ఏజెంట్' అంటూ తన కొడుక్కి శ్రీకాంత్ చెప్పగా... ట్రావెల్ ఏజెంటా? అని ప్రశ్నిస్తాడు. కాదు బేటా స్పై ఏజెంట్ అంటూ సీక్రెట్ రివీల్ చేస్తాడు. ఈ క్రమంలో తివారీపైనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావడం సస్పెన్స్ క్రియేట్ చేసింది.

ఓ సస్పెక్ట్‌గా మారిన శ్రీకాంత్ తన ఫ్యామిలీతో సహా వేరే ప్రాంతానికి వెళ్లేందుకు యత్నిస్తాడు. దీని వెనుక ఏదో పెద్ద గేమ్... బిగ్ ప్లాన్ ఉంది అంటూ ఎలివేషన్ ఇవ్వడం హైప్ ఇస్తోంది. అసలు ఆఫీసర్ శ్రీకాంత్ ఎందుకు సస్పెక్ట్ అయ్యాడు? అతని కోసం పోలీసులతో పాటు గ్యాంగ్ ఎందుకు వెతుకుతుంటారు? చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ ఎందుకు భయపడ్డాడు? ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

Also Read : SSMB29 నుంచి సడన్ సర్‌ప్రైజ్ - ఎవరూ ఊహించని క్రూరమైన 'కుంభ'... పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ వేరే లెవల్