సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. అంతేనా..‌. మాయా ప్రపంచం కూడా! వెండితెరపై కనిపించేదంతా నిజం అని నమ్మడానికి లేదు. ఆ తెర ముందున్న ప్రేక్షకులకు వినోదం అందించడం కోసం కొన్నిటిని ఫేక్ చేస్తారు. అందులో యాక్షన్ సీన్స్, ఫైట్స్ వంటివి ఉంటాయి. అయితే 'ఓం శాంతి శాంతి శాంతిః' (Om Shanti Shanti Shantihi Movie) సినిమాలో చెంప దెబ్బలు మాత్రం ఫేక్ కాదండోయ్... అవి ఒరిజినల్!

ఈషా రెబ్బాను లాగి పెట్టి కొట్టిన తరుణ్!
'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమాలో భార్య మీద భర్త చేయి చేసుకునే సన్నివేశాలు ఉన్నాయి. చెయ్యి చేసుకోవడం అంటే చంప దెబ్బలు. ఈ మూవీ ట్రైలర్ చూస్తే... మూడు సార్లు ఈషా రెబ్బా (Eesha Rebba)ను తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) కొట్టినట్లు కనబడుతుంది. సాధారణంగా అటువంటి చెంప దెబ్బలు ఉన్న సన్నివేశాలు తీసేటప్పుడు చెయ్యిని విసురుగా ఎదుటి వ్యక్తి మీద నుంచి తిప్పుతారు. అవతలి వ్యక్తి రియాక్షన్, సౌండ్ బట్టి నిజంగానే కొట్టిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. కానీ 'ఓం శాంతి శాంతి శాంతిః' కోసం అటువంటి ఫేక్ ట్రిక్స్ ప్లే చేయలేదట.

Also Read: Surya 46 Movie Title: వెంకీతో సూర్య సినిమాకు టైటిల్ అదేనా? క్లాసిక్ హిట్ సెంటిమెంట్ కలిసి వచ్చేలా?

చెంప దెబ్బలకు మీరు ఇచ్చిన రియాక్షన్ నిజం అని ప్రేక్షకులు ఫీల్ అవ్వాలి అంటే నిజంగానే కొట్టాలని దర్శకుడు ఏఆర్ సజీవ్ చెప్పడంతో... ఈషా రెబ్బాను తరుణ్ భాస్కర్ లాగిపెట్టి గట్టిగా ఒక్కటి పీకారట. ఒక సన్నివేశంలో ఈషా రెబ్బా ముఖం మీద తెల్లటి పిండి కనపడుతుంది. ఆ చెంప దెబ్బలు ఒరిజినల్ అని ఒక ఇంటర్వ్యూలో చిత్ర బృందం తెలిపింది. పాపం ఈషా రెబ్బా... సినిమా కోసం నిజంగా దెబ్బలు తిన్నది. అటువంటి డెడికేషన్ ఉన్న హీరోయిన్ ఈ రోజుల్లో ఉండడం గ్రేట్ కదూ!

Also Read: Singeetam Srinivasa Rao: 94 ఏళ్ళ వయసులో దర్శకత్వం... నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం కొత్త సినిమా

మలయాళంలో విజయం సాధించిన 'జయ జయ జయ జయహే' చిత్రానికి రీమేక్ 'ఓం శాంతి శాంతి శాంతిః'. మలయాళంలో బసిల్ జోసెఫ్ పోషించిన పాత్రను తెలుగులో తరుణ్ భాస్కర్... అక్కడ దర్శనా రాజేంద్రన్ పోషించిన పాత్రను ఇక్కడ ఈషా రెబ్బా పోషించారు. ఈ చిత్రానికి విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ల దగ్గర ఎటువంటి విజయం సాధిస్తుందో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

Also Read: Gatha Vaibhava Review - 'గత వైభవం' రివ్యూ: Prime Videoలో ఆషికా రంగనాథ్ సినిమా... మూడు జన్మల ప్రేమకథ ఎలా ఉందంటే?