Thandel 3rd Day Collections : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ, సినిమా బడ్జెట్లో దాదాపు 55% రాబట్టడం విశేషం. మూడు రోజుల్లో ఈ మూవీ 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది అంటూ తాజాగా మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ ను రిలీజ్ చేశారు.

'తండేల్' 3 డేస్ కలెక్షన్స్

డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా సర్వైవల్ థ్రిల్లర్ 'తండేల్'. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజే రూ. 11.5 కోట్ల నెట్ కలెక్షన్స్ తో భారీ ఓపెనింగ్ తో రాజులమ్మ జాతర స్టార్ట్ చేశారు నాగ చైతన్య. ఇక ఈ మూవీ రెండవ రోజు రూ. 12.1 కోట్లు కొల్లగొట్టింది. మూడో రోజు మాత్రం ఈ రెండు రోజుల కంటే కాస్త ఎక్కువగానే పెరిగాయి వసూళ్లు. 'తండేల్' థర్డ్ డే రూ. 41.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి, కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. మూడో రోజున తండేల్' ప్రపంచవ్యాప్తంగా రూ. 62.37 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది అంటూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో 'శివ' సాంగ్ కి త్రిశూలం పట్టుకుని సాయి పల్లవి, నాగచైతన్య డ్యాన్స్ చేస్తున్న పోస్టర్ ను వదిలారు.

The 'BLOCKBUSTER LOVE TSUNAMI' collects MASSIVE 𝟔𝟐.𝟑𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒+ 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in 3 days ❤️‍🔥🌊⚓

Fastest '𝟔𝟎𝐜𝐫+ 𝐠𝐫𝐨𝐬𝐬𝐞𝐫' for Yuvasamrat @chay_akkineni 🔥🤩

Book your tickets for BLOCKBUSTER #Thandel now!
🎟️ https://t.co/5Tlp0WNszJ… pic.twitter.com/rZlRQHYezo

— Thandel (@ThandelTheMovie) February 10, 2025

Also Read: ఇండస్ట్రీ అంతా ఒక్కటే కాంపౌండ్... బాలకృష్ణ, తారక్ అంటాడని విశ్వక్ ఫంక్షన్‌కు వెళ్లకూడదా? - చిరంజీవి

'తండేల్' బ్రేక్ ఈవెన్ టార్గెట్

'తండేల్' మూవీ దేశభక్తి అంశాలతో పాటు అందమైన లవ్ స్టోరీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాకు పాజిటివ్ రావడంతో రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇక 'తండేల్' మూవీ 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం మూవీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుండడంతో నిర్మాతలు త్వరలోనే లాభాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక కేవలం మూడు రోజుల్లోనే నాగచైతన్య ఏకంగా 50 కోట్ల క్లబ్లో చేరడం సంచలనగా మారింది. నాగ చైతన్యకు మొదటి పాన్ ఇండియా మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ వచ్చింది. సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి పడిన కష్టం కన్పిస్తోంది అంటూ చర్చ సాగుతోంది.

గర్వంగా ఉందంటూ నాగార్జున రియాక్షన్

'తండేల్' మూవీపై అక్కినేని నాగార్జున స్పందించారు. నాగచైతన్యను చూసి గర్వపడుతున్నాను. ఇది చై అభివృద్ధికి, ధైర్యానికి, కృషికి నిదర్శనమని తెలిపారు. అక్కినేని అభిమానులు అందరూ మా కుటుంబంలా మాకు అండగా నిలిచారు. తండేల్ విజయం మాది, అలాగే మీది కూడా. మీ అంతులేని ప్రేమ సపోర్ట్ కి కృతజ్ఞతలు" అంటూ చిత్ర బృందానికి పేరుపేరునా థాంక్స్ చెప్పారు నాగార్జున. మరోవైపు అక్కినేని అభిమానులు థియేటర్లలో 'తండేల్' మూవీని ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసిన ఆహా - జనసేనాని మీద అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో...